3 మార్చి 2026

సంపూర్ణ చంద్రగ్రహణం!

సమయం, ఎక్కడ కనిపిస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.

గ్రహణం ఎప్పుడు?

మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.





దీనివల్ల ఆ రోజు చంద్రుడు ఎర్రగా, అంటే 'బ్లడ్ మూన్' లాగా కనిపిస్తాడు. ఈ గ్రహణం సాయంత్రం సమయంలో ఉంటుంది.

భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుంది?

సంపూర్ణంగా కనిపించే ప్రాంతాలు:

  • అరుణాచల్ ప్రదేశ్
  • అస్సాం
  • నాగాలాండ్ & మేఘాలయ

పాక్షికంగా కనిపించే ప్రాంతాలు:

  • మిగిలిన భారతదేశం
  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు తదితర నగరాల్లో...

సూతక కాలం ప్రారంభం

ఈ రోజున ఉదయం 6:19 గంటలకు సూతక కాలం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3:20 గంటలకు పాక్షిక గ్రహణం ప్రారంభం అవుతుంది.

విజయవాడలో చంద్రోదయం సాయంత్రం 06:14 ఇక్కడి నుండి గ్రహణం కనిపిస్తుంది.

Visit: TeluguCalendar.Org

తెలుగు రాష్ట్రాల్లో...

పాక్షిక చంద్రగ్రహణ సమయాలు
గ్రహణం సమయాలు
పెనంబ్రల్ ప్రారంభం02:14 PM కనిపించదు
పాక్షిక ప్రారంభం03:20 PM కనిపించదు
సంపూర్ణ ప్రారంభం04:34 PM కనిపించదు
గరిష్ట స్థాయి05:03 PM కనిపించదు
సంపూర్ణ ముగింపు05:32 PM కనిపించదు
గరిష్ట గ్రహణం06:16 PM ఇక్కడి నుండి కనిపిస్తుంది
పాక్షిక ముగింపు06:47 PM
పెనంబ్రల్ ముగింపు07:53 PM

అట్లాంటా, GA, USA

సంపూర్ణ చంద్రగ్రహణం సమయాలు
గ్రహణం సమయాలు
పెనంబ్రల్ ప్రారంభం03:44 AM
పాక్షిక ప్రారంభం04:50 AM
సంపూర్ణ ప్రారంభం06:04 AM
గరిష్ట స్థాయి06:33 AM
సంపూర్ణ ముగింపు07:02 AM
చంద్రాస్తమయం07:05 AM
పాక్షిక ముగింపు08:17 AM కనిపించదు
పెనంబ్రల్ ముగింపు09:23 AM కనిపించదు

చికాగో, IL, USA

సంపూర్ణ చంద్రగ్రహణం సమయాలు
గ్రహణం సమయాలు
పెనంబ్రల్ ప్రారంభం02:44 AM
పాక్షిక ప్రారంభం03:50 AM
సంపూర్ణ ప్రారంభం05:04 AM
గరిష్ట స్థాయి05:33 AM
సంపూర్ణ ముగింపు06:02 AM
చంద్రాస్తమయం06:24 AM
పాక్షిక ముగింపు07:17 AM కనిపించదు
పెనంబ్రల్ ముగింపు08:23 AM కనిపించదు

పెర్త్, WA, ఆస్ట్రేలియా

సంపూర్ణ చంద్రగ్రహణం సమయాలు
గ్రహణం సమయాలు
పెనంబ్రల్ ప్రారంభం16:44 కనిపించదు
పాక్షిక ప్రారంభం17:50 కనిపించదు
చంద్రోదయం18:43
సంపూర్ణ ప్రారంభం19:04
గరిష్ట స్థాయి19:33
సంపూర్ణ ముగింపు20:02
పాక్షిక ముగింపు21:17
పెనంబ్రల్ ముగింపు22:23

టొరంటో, కెనడా

సంపూర్ణ చంద్రగ్రహణం సమయాలు
గ్రహణం సమయాలు
పెనంబ్రల్ ప్రారంభం03:44 AM
పాక్షిక ప్రారంభం04:50 AM
సంపూర్ణ ప్రారంభం06:04 AM
గరిష్ట స్థాయి06:33 AM
చంద్రాస్తమయం06:52 AM
సంపూర్ణ ముగింపు07:02 AM కనిపించదు
పాక్షిక ముగింపు08:17 కనిపించదు
పెనంబ్రల్ ముగింపు09:23 కనిపించదు

ఫీనిక్స్, AZ, USA

సంపూర్ణ చంద్రగ్రహణం సమయాలు
గ్రహణం సమయాలు
పెనంబ్రల్ ప్రారంభం01:44 AM
పాక్షిక ప్రారంభం02:50 AM
సంపూర్ణ ప్రారంభం04:04 AM
గరిష్ట స్థాయి04:33 AM
సంపూర్ణ ముగింపు05:02 AM
పాక్షిక ముగింపు06:17 AM
చంద్రాస్తమయం06:58 AM
పెనంబ్రల్ ముగింపు07:23 కనిపించదు

ఆక్లాండ్, న్యూజిలాండ్

సంపూర్ణ చంద్రగ్రహణం సమయాలు
గ్రహణం సమయాలు
పెనంబ్రల్ ప్రారంభం21:44
పాక్షిక ప్రారంభం22:50
సంపూర్ణ ప్రారంభం00:04 Mar 4
గరిష్ట స్థాయి00:33 Mar 4
సంపూర్ణ ముగింపు01:02 Mar 4
పాక్షిక ముగింపు02:17 Mar 4
పెనంబ్రల్ ముగింపు03:23 Mar 4

సూతక కాల నియమాలు

గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలను మూసివేస్తారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా ఇతర మతపరమైన వేడుకలను ఈ సమయంలో నిర్వహించరు. గ్రహణ సమయంలో దేవతా మూర్తులను (విగ్రహాలను) తాకడం నిషిద్ధం.

సాధారణంగా గ్రహణానికి కొన్ని గంటల ముందే వంట చేయడం, భుజించడం ఆపేస్తారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై దర్భలను ఉంచుతారు.

గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి, తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ గ్రహణం హోలీ రోజున వస్తోంది. గ్రహణ మోక్షం తర్వాతే పండుగ వేడుకలు జరుపుకోవడం శ్రేయస్కరం.

Visit: TeluguCalendar.Org

ఈ దేశాలలో... చంద్రగ్రహణం

భారతదేశంతో పాటు...
శ్రీలంక, మాల్దీవులు,
తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా,
పసిఫిక్ మహాసముద్రం,
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం,
రష్యా, కజకిస్తాన్,
అమెరికా, బ్రెజిల్, గ్రీన్లాండ్,
తదితర దేశాలలో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది.

Visit: TeluguCalendar.Org

జాగ్రత్తలు అవసరమా?

సూర్యగ్రహణంలా కాకుండా, శాస్త్రీయంగా చంద్రగ్రహణాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా నేరుగా కళ్లతో చూడవచ్చు. దీని వల్ల కంటికి ఎలాంటి హాని కలగదు!

అయితే మన సాంప్రదాయ మరియు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.


ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి.

Visit: TeluguCalendar.Org