Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Dhannus Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.
శ్రీ పరాభవ నామ సంవత్సరము నందు ధనూరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుండగలదు. భోగ లాలసతో జీవించెదరు. విదేశీ పర్యటనలు చేసి ధనము ఖర్చు చేయుదరు. ధనాదాయము బాగుండును. ఆరోగ్య సిద్ధి కలుగును. ప్రభుత్వ ఉన్నతోద్యోగులతో, రాజకీయ నాయకులతో స్నేహము చేయుదురు. శరీర పోషణ కలుగును. ఇష్ట కార్యసిద్ధి పొందగలరు. భార్య భర్తల మద్య సఖ్యత కలిగి సౌఖ్య జీవనము చేయుదురు. సంతాన వృద్ధి కలుగును. భూ, గృహ నిర్మాణాది కార్యములు సత్వరము పూర్తి చేయగలరు. సంఘ గౌరవము పెరుగును. బంధువులతో మంచి సంబందములు కలిగి యుండును. వివాహాది శుభకార్య నిర్వహణ చేయుదురు. మధ్య మధ్య అనారోగ్య లోపములు కలుగును. వైద్యశాలా దర్శనము ఔషద సేవనము తప్పని సరి అగును. దొంగల భయము కలుగును. విలువైన వస్తువులు డ్యాకుమెంట్లు పోగొట్టుకొనుట జరుగును. బ్యాంకు లావాదేవీలు సమస్యాత్మకంగా ఉండగలవు. ఆదాయ మార్గములు మూసుకొని పోవును. ఋణభారము పెరుగును. అగ్ని భయము కలుగును. శరీరము నందు కాలిన గాయములు కలుగును. గాంభీర్యము చెడిపోవును. క్రూరోక్తులు వచించెదరు. శత్రుభాద పెరుగును. వాతరోగ భయము కలుగును. మనోచింత భీతి భయము కలుగును. అవాంచనీయ పోలీసు కోర్టుకేసులు మీద పడును. స్వస్థాన హాని కలుగును. అజ్ఞాతవాసము చేయవలసి వచ్చును. సోదర సోదరీలతో సమస్యలు ఏర్పడును. వృధా సంచారము ఆనారోగ్యలోపములతో శస్త్ర చికిత్సలు ఔషద సేవనం తప్పని సరి అగును. వ్యవహార చిక్కులు కలుగును. తల్లి ఆరోగ్యము మందగించును. ప్రమాదములు కలుగును.
2026-2027 ధనూరాశికి సంవత్సర ప్రారంభమున అత్యంత భోగకరమైన జీవనము సాగింతురు. అధిక ధన వ్యయము చేయుచు 1కి 2 వస్తువులు సమకూర్చుకొందురు. దూరప్రాంత ప్రయాణము చేయుదురు. విలాసవంతమైన విదేశీ పర్యటనలు చేయుదురు. ధనాదాయము బాగుండుటచే మితిమీరిన ఖర్చులు చేయుదురు. గురు దేవతా దర్శనములు పుణ్యక్షేత్ర సందర్శనలు చేయుదురు. హంగు ఆర్భాటములు కొరకు ధనవ్యయము చేయుదురు. భార్య భర్తల మధ్య సఖ్యత కలుగును. భార్య/భర్త తరపు బంధువులతో మంచి సంబంద భాందవ్యములు నెలకొనును. సంఘ గౌరవము పెరుగును. ఇష్టసిద్ధి కార్యదర్శనము చేయుదరు. ప్రభుత్వ పరమైన అనుమతులు సత్వరము లభించి కార్యజయము కలుగును. ఇంటియందు శుభకార్యములు అత్యధిక ధనవ్యయముతో చేసి అందరి మన్నన్నలు పొందగలరు. నూతన వస్తు వస్త్ర వాహనములు సమకూర్చుకొందురు. విదేశీ వస్తువులు బహుమతులుగా పొంద గలరు. భూలాభము క్షేత్రవృద్ధి, గో, పశులాభము కలుగును. బ్రహ్మచారులకు సత్వరములు వివాహములు కాగలవు. సంతానయోగము కలుగును. సర్వదా ఆనందముగా నుందురు.
2026-2027 ధనూరాశికి సంవత్సర ద్వితీయ భాగమున ఆరోగ్యము మందగించును. హఠాత్తుగా వైద్యశాలా దర్శనము చేయవలసివచ్చును. ఔషద సేవనం తప్పని సరి అగును. బంధుమిత్రాదులు ఆందోళనకు గురి అగుదురు ఋణభారము పెరుగును. క్షేత్ర సందర్శనమలు వాయిదా పడును. దొంగల భయము కలుగును. విలువైన వస్తువులు పొగొట్టుకొనుట తస్కరించబడుట కలుగును. మతిమరపుచే పెద్దమొత్తంలో సొమ్ము పోగొట్టుకొందురు. బ్యాంకు లావాదేవీల యందు ప్రయాణముల యందు అప్రమత్తతతో మెలగవలెను. అపరిచిత వ్యక్తుల వలన విలువైన వస్తువులు పొగొట్టుకొనుట జరుగును. అగ్నిభయము కలుగును. ప్రమాదముల వలన నష్టములు సంభవించును. ప్రభుత్వము నుండి ప్రభుత్వ అధికారుల నుండి భయము కలుగును. పోలీసు కోర్టుకేసుల విషయములో అప్రమత్తతతో మెలగవలెను. జరిమానాలు ఫైన్‌లు చెల్లించవలసి వచ్చును. తగిన ఆదాయ వనరులు ఉన్ననూ సమయానికి అక్కరకు రాకుండును. బంధుమిత్రాదులతో నిత్య కలహములు కలుగును. పదవీ త్యాగములు ఉండును. శరీర గాంభీర్యము తగ్గి తెగువ కోపము కలుగును. ఇంటియందు ప్రసవము కలుగును. శరీర పుష్టి తగ్గును. తల్లి ఆరోగ్యము మందగించును.
2026-2027 ధనూరాశికి సంవత్సర తృతీయ భాగమున ఆరోగ్యము చేకూరును. ధనాదాయము బాగుండును. నూతన కార్యములు చేపట్టెదరు. సంఘము నందు గుర్తింపు కలిగి సంతోషముగా నుందురు. భూ, గృహ నిర్మాణాది కార్యములు పూర్తి చేసెదరు. చేయు వృత్తి వ్యాపార కృషి వాణిజ్య ఉద్యోగాదుల యందు శుభపరిణామములు కలుగును. సర్వులు మీ మాటపై నిలచెదరు. అపరిమితమైన సంతోషముతో నుందురు. భార్య/భర్తల మధ్య సఖ్యత కలిగి సౌఖ్యముగా నుందురు. సంతాన మూలక అభివృద్ధి కలుగును. నూతన కార్యములు చేసెదరు. కొత్త ప్రణాళికలు వ్యాపార విస్తరణ కార్యములు చేపట్టెదరు. ఇష్ట వస్తు లాభము కలుగును. మృష్టాన్నభోజన ప్రాప్తి విలువైన వస్తు వాహన సామాగ్రి సమకూర్చుకొందురు. సువర్ణ రజిత ఆభరణాదులు అప్రయత్నముగా చేకూరును. విదేశీ వస్తు సంచయము కలుగును. పిత్రార్జితము లభించును. తండ్రివైపు బంధువులతో సఖ్యత కలిగి స్థిర చరాస్తులు సమకూరును.
2026-2027 ధనూరాశికి సంవత్సరాంతమున ఆదాయము తగ్గును. శారీరక అలసట పెరుగును. మనోచింత ఇంటా బయట సమస్యలతో ఆందోళనకు గురి అగుదురు. శరీర ఆరోగ్యము మందగించును. శూల రోగము కలుగును. శస్త్ర చికిత్సలకు దారి తీయును. చేయు వృత్తి వ్యాపార ఉద్యో గాదులయందు వ్యతిరేకత వ్యక్తమగును. భృత్యు కలహములు కలుగును. భాగస్వాములు మధ్య విభేదములు పొడచూపును. వాణిజ్య సంస్థలు విడిపోవు అవకాశమున్నది. కొన్ని వ్యాపారములు మూతపడును. మనో విచారముతో కార్య విలంభము కలుగును. జంతు భయము. పెంపుడు జంతువులకు హాని కలుగును. ప్రభుత్వ పెద్దలతో మాట కలసిరాకపోవుటచే కొన్నికార్యముల ఆగిపోవును. దూర ప్రయాణములు కలిగి అచ్చట లాభము లేక తిరిగి రావలసి వచ్చును. ప్రమాదములచే ఆరోగ్యము నశించును. ఇంటి యందు అమంగళములు జరుగును.
విద్యార్దులకు మిశ్రమ కాలము సాధారణ మార్కులతో సరిపెట్టుకొనవలసి వచ్చును. ర్యాంకులు విషయములో వెనుకబడి పోవుదురు. ఆరోగ్యలోపములతో విద్యకు ఆటంకములు కలుగును. నూతన ప్రయత్నములు ఆటకంములతో నెరవేరును.
నిరుద్యోగులకు అనుకూల కాలము కాదు. చేసిన ప్రయత్నములు చివరిలో బెడిసి కొట్టును. తృటిలో అవకాశములు చేజారును. ఆర్ధిక మోసములకు గురి అయ్యేదరు. చిన్న అవకాశములతో సరిపెట్టుకొనవలసి వచ్చును.
ఉద్యోగులు కత్తిమీద సాము వలె నుండును. రాజకీయ ఒత్తిళ్ళతో ఉద్యోగ బాధ్యతలు బారముగా మారును. అవాంఛనీయ బదిలీలు కలుగును. ప్రమోషన్లు ఊరించి ఉసూరమనిపించెను. ఎసిబి దాడులకు గురి అగుదురు.
వ్యాపారులకు అనుకూల కాలము కాదు. నష్టములు చవిచూచెదరు. అభివృద్ధి తగ్గిపోవును. భాగస్వాముల మధ్య కలహములతో వ్యాపార సంస్థలు మూతపడును. స్థాన భ్రంశము కలుగును.
కార్మికులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. గౌరవ మర్యాదలు తగ్గును. యజమానులు, సహచరులతో సఖ్యత లోపించును. ఆదాయము క్షీణించును.
వ్యవసాయదారులకు ఆదాయము తగ్గును. చీడపీడల ఉదృతితో సమస్యలు కలుగును. ప్రభుత్వ మద్ధతు లేకుండును. ప్రకృతి వైపరీత్యములతో నష్టపోవుదురు. పశు క్షేత్ర వృద్ధి సామాన్యముగా నుండును.
ఆక్వాకల్చర్ వారికి మిశ్రమ కాలము. కష్టమునకు తగిన ప్రతిఫలము లేకుండును. ఆదాయ వనరులు తగ్గిపోవును. ఋణభారము పెరుగును. మార్కెట్లో పోటీని తట్టుకొనలేక చతికిల పడిపోవుదురు.
కవులు, కళాకారులు వారికి అపఖ్యాతి కలుగును. గౌరవమర్యాదలు తగ్గును. అనారోగ్య లోపములతో మాట నిలబెట్టుకొనలేక కొన్ని కార్యక్రమములు వదలివేయవలసి వచ్చును.
సినిమారంగము వారికి అనకూల కాలము కాదు. ప్రజాదరణ తగ్గును. సర్వకార్య విలంభముతో నష్టపోవుదురు. కొత్తప్రాజెక్టులు వాయిదా పడును.
రాజకీయ నాయకులకు వ్యతిరేక కాలము పదవీ త్యాగములుండును. ప్రజా ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమగును. అభివృద్ధి నిరోధకముగా నుండగలదు.
NRIలకు అనుకూలము కాదు. విదేశీ ప్రయాణములకు ఆటంకములు కలుగును. స్పెక్యులేషన్ సామాన్యము.
రాహు, కేతు, శని, గురు, చంద్ర, బుధ గ్రహములకు శాంతులు చేసుకొనవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.
మిత్ర సంఖ్యలు 1, 2, 4, 7, 9 మిత్ర సంఖ్యలు. ప్రతినెల 3, 12, 21, 30 తేదీలు ఆది, సోమ, గురువారములు.
మూలా-వైడూర్యము, పుర్వాషాడ-వజ్రము, ఉత్తరాషాడ-కెంపు.
త్రిముఖి, ద్వాదశముఖి, ఏకోన్నవింశతిముఖి ధరించిన శుభం.
Get the high-resolution PDF - Dhannus 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.
ముఖ్య సూచన: ఈ ధనుస్సు రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.