ఆగష్టు 2026 తెలుగు పండుగలు

తెలుగు పండుగలు 2026 ఆగష్టు నెలలో భారత స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, నాగ పంచమి, రాఖీ పౌర్ణమి లాంటి ఎన్నో విశేష పండుగలు రాబోతున్నాయి. ఇదే నెలలో పవిత్రమైన శ్రావణ మాసం కూడా ప్రారంభం కానుంది. పూర్తి పండుగల జాబితాను కింద చూడవచ్చు.
Telugu Festivals 2026 August
Advertisement
ఆగష్టు 02, 2026 పండుగలు
ఆదివారం

స్నేహితుల దినోత్సవం

పింగళి వెంకయ్య జయంతి

సంకష్టహర చతుర్థి

బోనాలు (తెలంగాణ)

ఆగష్టు 03, 2026 పండుగలు
సోమవారం

ఆశ్లేష కార్తె

ఆగష్టు 04, 2026 పండుగలు
మంగళవారం

అర్బయీన్

ఆగష్టు 05, 2026 పండుగలు
బుధవారం

కాలాష్టమి

మాసిక కృష్ణ జన్మాష్టమి

ఆగష్టు 07, 2026 పండుగలు
శుక్రవారం

రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి

ఆగష్టు 09, 2026 పండుగలు
ఆదివారం

ఏకాదశి

కామిక ఏకాదశి (కామద ఏకాదశి)

బోనాలు (తెలంగాణ)

కృష్ణ వాసుదేవ ద్వాదశి

క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం

ఆగష్టు 10, 2026 పండుగలు
సోమవారం

బోనాలు (తెలంగాణ)

ప్రదోష వ్రతం

ఆగష్టు 11, 2026 పండుగలు
మంగళవారం

మాస శివరాత్రి

ఆగష్టు 12, 2026 పండుగలు
బుధవారం

అమావాస్య

అన్వాధానం

ఆషాఢ అమావాస్య

గురు మౌఢ్యమి త్యాగం

ఆగష్టు 13, 2026 పండుగలు
గురువారం

ఇష్టి

శ్రావణ మాసం ప్రారంభం

వర్షఋతువు ప్రారంభం

ఆగష్టు 14, 2026 పండుగలు
శుక్రవారం

చంద్ర దర్శనం

ఆగష్టు 15, 2026 పండుగలు
శనివారం

భారత స్వాతంత్య్ర దినోత్సవం

పార్సీ నూతన సంవత్సరం

ఆగష్టు 17, 2026 పండుగలు
సోమవారం

స్కంద షష్ఠి

నాగ పంచమి

సింహ సంక్రమణం

మఖ కార్తె

శ్రావణ సోమవార వ్రతం ప్రారంభం

ఆగష్టు 18, 2026 పండుగలు
మంగళవారం

శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రారంభం

సుభాష్ చంద్రబోస్ వర్ధంతి

ఆగష్టు 19, 2026 పండుగలు
బుధవారం

తులసీదాస్ జయంతి

ఆగష్టు 20, 2026 పండుగలు
గురువారం

మాసిక దుర్గాష్టమి

ఆగష్టు 21, 2026 పండుగలు
శుక్రవారం

వరలక్ష్మి వ్రతం (ఆంధ్ర ప్రదేశ్)

వరలక్ష్మి వ్రతం (తెలంగాణ)

ఆగష్టు 23, 2026 పండుగలు
ఆదివారం

ఏకాదశి

శ్రావణ పుత్రద ఏకాదశి (పవిత్రోపన ఏకాదశి)

ఆగష్టు 24, 2026 పండుగలు
సోమవారం

దామోదర ద్వాదశి

శ్రావణ సోమవార వ్రతం (రెండవ)

ఆగష్టు 25, 2026 పండుగలు
మంగళవారం

ప్రదోష వ్రతం

భౌమ ప్రదోషం

మిలాద్-ఉన్-నబీ (ఆంధ్ర ప్రదేశ్)

శ్రావణ మంగళ గౌరీ వ్రతం (రెండవ)

ఆగష్టు 26, 2026 పండుగలు
బుధవారం

మిలాద్-ఉన్-నబీ (తెలంగాణ)

ఓనం

మదర్ తెరెసా జయంతి

ఆగష్టు 27, 2026 పండుగలు
గురువారం

హయగ్రీవ జయంతి

పౌర్ణమి వ్రతం

అన్వాధానం

శ్రావణ పూర్ణిమ వ్రతం

ఆగష్టు 28, 2026 పండుగలు
శుక్రవారం

పౌర్ణమి

రాఖీ పౌర్ణమి (తెలంగాణ)

రక్షా బంధన్

జంధ్యాల పూర్ణిమ

వరలక్ష్మి వ్రతం

శ్రావణ పౌర్ణమి

ఇష్టి

ఆగష్టు 29, 2026 పండుగలు
శనివారం

తెలుగు భాషా దినోత్సవం

గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి

ఆగష్టు 31, 2026 పండుగలు
సోమవారం

సంకష్టహర చతుర్థి

శ్రావణ సోమవార వ్రతం (మూడవ)

పుబ్బ కార్తె

ఆగష్టు 2026 పండుగల విశేషాలు

Advertisement

స్నేహితుల దినోత్సవం (ఆగష్టు 2)

ప్రతి సంవత్సరం ఆగష్టు మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్ షిప్ డే (స్నేహితుల దినోత్సవం) జరుపుకుంటారు. స్నేహ బంధానికి ప్రతీకగా స్నేహితులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

క్విట్ ఇండియా దినోత్సవం (ఆగష్టు 9)

1942 ఆగష్టు 9 న మహాత్మా గాంధీ నాయకత్వంలో "డూ ఆర్ డై" (కరో యా మరో) నినాదంతో బ్రిటిష్ వారిని దేశం విడిచి వెళ్ళమని క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు.

శ్రావణ మాస ప్రారంభం (ఆగష్టు 13)

హిందూ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి. శివుడు, విష్ణువు, మరియు మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు మరియు వ్రతాలు చేస్తారు.

స్వాతంత్య్ర దినోత్సవం (ఆగష్టు 15)

బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వేచ్ఛ పొందిన రోజు. ప్రతి సంవత్సరం ఆగష్టు 15న ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటారు.

నాగ పంచమి (ఆగష్టు 17)

శ్రావణ మాస శుక్ల పంచమి నాడు జరుపుకునే పండుగ. మహిళలు పుట్టలో పాలు పోసి, నాగదేవతను పూజించి తమ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటారు.

వరలక్ష్మి వ్రతం (ఆగష్టు 21 & 28)

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ముత్తైదువులు ఆచరించే అత్యంత పవిత్రమైన వ్రతం. అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

మిలాద్-ఉన్-నబీ (ఆగష్టు 25 & 26)

ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ జన్మదినాన్ని ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ గా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటారు. ప్రవక్త బోధనలను ఈ రోజు స్మరించుకుంటారు.

రాఖీ పౌర్ణమి (ఆగష్టు 28)

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. శ్రావణ పౌర్ణమి నాడు సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దీవిస్తారు.

తెలుగు భాషా దినోత్సవం (ఆగష్టు 29)

వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగష్టు 29 న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు.

» Telugu Festivals 2026 (IST)
Telugu Festivals 2026