Kanya Rasi 2026-2027 Telugu Rasi Phalalu Yearly Horoscope

Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Kanya Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.

కన్యరాశి 2026-2027 Rasi Phalalu Banner
ఉత్తర (2,3,4), హస్త (4), చిత్త (1,2) పాదాలు.
💰 ఆదాయం: 8, 💸 వ్యయం: 11, 👑 రాజ్యపూజ్యం: 3,🚫 అవమానం: 3

శ్రీ పరాభవ నామ సంవత్సరము నందు కన్యారాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభాధిక మిశ్రమ ఫలితములతో నుండును. ఆర్ధిక విషయములు పూర్తిగా అనుకూలించును. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము కలుగును. సకల కార్యముల యందు విజయము సాధించెదరు. ధనవృద్ధి కనబడును. కాని అధిక ధనవ్యయము చేయుటచే చివరకు మిగిలినది తక్కువగా ఉండును. ఋణ భారము తగ్గి వృద్ధిలోనికి వచ్చెదరు. భూ, గృహ నిర్మాణాది కార్యములు సత్వరమే నేరవేర్చగలరు. శుభకార్య నిర్వహణ అనుకూ లించును. బంధు మిత్రాదులు బెల్లము చుట్టూ చీమలు చేరినట్లు చేరి మీ వనరులను ఉప యోగించుకొని చివరికి రిక్త హస్తము చూపెదరు. సంఘ గౌరవము పెరుగును. నూతన పదవులు అలంకరించెదరు. ఇంటా, బయటా కలహములు నిత్యకృత్యమగును. భార్య భర్తల మధ్య సఖ్యత లోపించును. పరిస్థితి విడాకుల వరకు దారి తీయును. బంధువులు మధ్యలో దూరి సమస్యలు మరింత జఠిలము చేయుదురు. ధనవ్యయమునకు వెనుకాడకుండా అన్ని విషయముల యందు సంచరించెదరు. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు కలహ వాతావరణము కలుగును. అధికారులతో వాగ్వివాదములు చోటు చేసుకొనును. దుర్వ్యయము పెరిగిపోవును. ఆరోగ్యము సామాన్యముగా నుండును. మనోచింత పెరుగును. సర్వకార్యములు వాయిదాల మీద నడుచును. పొగడ్తలకు లొంగి చివరకు మోసపోవుదురు. దేశాంతర ప్రయాణములు తరచూ ఎదురగును. హృదయ సంబందిత వ్యాధులకు గురి అగుదురు. నేత్ర బాధ, శత్రుభయము కలుగును. అన్యస్థలవాసము అకాల భోజనము కలుగును. పశు, క్షేత్ర వృద్ధి చేయుదురు. క్షీరాన్నాధి సుఖ భోజనము నూతన శయ్యా సౌఖ్యము మనస్సంతోషము కలుగును. పుణ్యక్షేత్ర గమనము చేయుదురు.

2026-2027 కన్యారాశికి సంవత్సర ప్రారంభమున ఆర్ధికముగా వెనుకబడి ఉందురు. ఋణ భారము పెరుగును. ఆర్ధిక ఒత్తిడితో మానసిక చింత కలుగును. అపవాదములు పెరుగును. చేయ వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు ఆర్ధిక లాభము లేకుండును. సంఘ గౌరవము తగ్గును. మీకన్నా తక్కువ వారి వలన మాటలు పడుదురు. పదవీత్యాగము కలుగును. కుటుంబ సమస్యలు పెరిగి కలహములతో కలత చెందుదురు. భూ, గృహ నిర్మాణాది కార్యములు వాయిదా పడును. శుభకార్యములకు ఆటంకములు ఏర్పడును. ఆరోగ్యము క్షీణించును. ఔషద సేవనం తప్పనిసరి అగును. పోలీసు కోర్టు కేసుల విషయములో వ్యతిరేకత వ్యక్తమగును. మందగమనము వృధాసంచారము మనోవ్యధ కలుగును. దూర ప్రాంత సంచారము చేసి రిక్త హస్తములతో వెనుదిరుగుదురు. భృత్యు కలహము కలుగును. మర్యాద తగ్గును.

2026-2027 కన్యారాశికి సంవత్సర ద్వితీయ భాగమున ఊరట లభించును. ఆర్ధిక వ్యవహారములు గాడిన పడును. ఆదాయ మార్గములు కనపడును. నూతన వ్యవహార జయము అనుకూలత కలుగును. శత్రుపీడ, శత్రుభయము తొలగును. బంధుమిత్ర సహకారము లభించి భూ, గృహ నిర్మాణాది కార్యములు తిరిగి ప్రారంభమగును. కుటుంబ జీవనము సుఖశాంతులతో వర్ధిల్లును. అనుమానపు పొరలు తొలగిపోవును. ఆరోగ్యము సహకరించును. చేయు వృత్తి వ్యాపార కృషి వాణిజ్య ఉద్యోగాదుల యందు అనుకూలత పెరిగి ఆర్ధికముగా బలపడెదరు. కార్య నిర్వహణ సులభతరమగును. లౌక్యముగా వ్యవహరించి సమస్యలనుండి బయట పడెదరు. బుద్ధి వికసించి పరాక్రమంతో ధైర్యయుక్తమైన పనులు చేసెదరు. శారీరక బలము కలుగును. ముఖము నందు తేజస్సు ఎల్లచోట్ల జయము కలుగును. మంత్రసిద్ధి కలుగును. గురు పండిత దేవతా దర్శనములు పుణ్యక్షేత్ర సందర్శనములు చేసెదరు. అన్నదాన కార్యక్రమముల యందు పాల్గోందురు. కీర్తి వృద్ధి కలుగును. రాజీ ధోరణితో వ్యవహరించి మంచి ఫలితములు పొందగలరు. శత్రు పన్నాగముల నుండి విజయవంతముగా బయట పడెదరు.

2026-2027 కన్యారాశికి సంవత్సర తృతీయ భాగము నందు ధనవ్యయము అధికమగును. సంపాదించినదం తయూ ఖర్చు చేసెదరు. హంగు ఆర్భాటముల కొరకు విపరీతమైన ఖర్చు చేయుటచే ఆర్ధిక వనరులు క్షీణించును. సర్వులతో కలహములు కలుగును. మాటకు విలువ లేకుండును. ఆరోగ్యలోపములు తరచూ వేధించును. శత్రువర్గ బలము పెరుగును. భార్య/భర్త సంతానముల మధ్య సఖ్యత లోపించి నిత్య కలహములతో జగడములతో మనశ్శాంతి కోల్పోవుదురు. కోర్టులను ఆశ్రయంచవలసి వచ్చును. వృధా సంచారము చేయుదురు. కృషి నష్టము కలుగును. విలువైన వస్తువులు పొగొట్టుకొందురు. మతిభ్రంశము, చోరభయము కలుగును. పోలీసు కోర్టు కేసుల విషయములో వ్యతిరేక ఫలితములు కలుగును. ఆర్ధిక నష్టములు ఋణ బాధలు పెరుగును. సమయమునకు తగిన ఆహారము లేక ఇబ్బంది పడెదరు. నీరసము నిస్సత్తువ ఆవహించును. బ్యాంకు లావాదేవీలు షూరిటీల విషయములో సమస్యలు కలుగును. వృధా సంచారము చేయుదరు. కష్టపడిన ఫలితము లేకుండును. శుభకార్యములు వాయిదా పడును. వైరాగ్యము పొడ చూపును. ఆథ్యాత్మిక చింతనలోనికి పోవుదురు.

2026-2027 కన్యారాశికి సంవత్సరాంతమున తిరిగి అన్నివిధములా పుంజుకొందురు. ఆర్ధికముగా బలము కలుగును. ఆరోగ్యము సిద్ధించును. అప్రయత్న కార్యసిద్ధి ధనలాభము కలుగును. సంఘ గౌరవము పెరిగి అభివృద్ధిలోనికి వత్తురు. సర్వులు మీ పట్ల జాగరూకతతో నుందురు. ఆదాయ వనరులు పెరుగుటచే సకల సమృద్ధి సకల కార్యసిద్ధి కలుగును. భార్య భర్తల సమస్యలు రాజీ ధోరణితో కొలిక్కి వచ్చును. సంతాన మూలక సమస్యలు పరిష్కారమగును. గురు పండిత దేవతా సందర్శనలు చేయుదురు. క్షేత్రవృద్ధి పశువృద్ధి గో లాభము కలుగును. ఇంటియందు శుభకార్యప్రయత్నములు నెరవేరును. సంఘ గౌరవము పెరిగి ప్రజా ప్రభుత్వ గుర్తింపు పొందెదరు. నూతన రాజకీయ పదవీయోగం లభించును. చేయు వృత్తి కృషి వాణిజ్య వ్యాపార ఉద్యోగాదుల యందు మీ మాటపైచేయిగా నుండును. అన్నింటా ధనార్జన కలుగును. ఆప్తమిత్ర బంధు సహవాసము కలసి వచ్చును. నూతన ప్రయత్నములు సఫల మగును. నూతన వస్తు వస్త్ర ఆభరణాదులు సంగ్రహించెదరు. పుష్ప మాలికా సౌఖ్యము కలుగును. తీర్థ యాత్రలు చేయుదురు. సర్వదా సుఖ సంతోషములతో నుందురు.

విద్యార్దులకు అనుకూల కాలము పడిన శ్రమకు తగిన ఫలితములు కలుగును. 90% మార్కులు సాధించగలరు. నూతన ప్రయత్నములు ఆలస్యము మీద ఫలించును. ప్రథమ శ్రేణి తృటిలో తప్పిపోవును.

నిరుద్యోగులకు మంచి అవకాశములు కలుగును. స్థాయికి తగిన ఉద్యోగము పొందుటలో నిరాశ కలిగిననూ అతికష్టము మీద సాధించెదరు. అప్రమత్తతో వ్యవహరించవలెను పరిశ్రమ చేయక తప్పదు.

ఉద్యోగులకు సహచరులతో కలహ వాతావరణము కలుగును. పై అధికారుల ఒత్తిడి ఎక్కువ అగును. బదిలీలు అకారణ స్థాన చలనములు కలుగును. ప్రమోషన్లు చివరి నిమిషములో వాయిదా పడును. భూ, గృహ వాహనయోగము కలుగును.

వ్యాపారులకు మిశ్రమ స్పందన కలుగును. నూతన ప్రయత్నములు వాయిదాపడి చివరికి పట్టాలెక్కును. లాభము సామాన్యముగా నుండును. కొన్ని వ్యాపారములు స్థాన చలనము కలుగును.

కార్మికులకు చేసిన పనికి తగిన గుర్తింపు లభించగలదు. ఆదాయము సామాన్యముగా నుండును. అనారోగ్య సమస్యలు బాధించును. సహచరులతో కలహములు కలుగును. స్థాన చలనములుండును.

వ్యవసాయదారులకు చీడపీడల ఉదృతి ఉన్ననూ సామాన్య దిగుబడి కలుగును. నూతన క్షేత్ర వృద్ధి పశు లాభము గో లాభము కలుగును. సర్వులతో కలహములు కలగును.

ఆక్వాకల్చర్ వారికి సామాన్య కాలము. అతికష్టము మీద ఫలితములు సాధించగలరు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం.

కవులు, కళాకారులు సంఘ గౌరవము సామాన్యముగా నుండును. ప్రజాప్రభుత్వ గుర్తింపు పొందగలరు.

సినిమారంగము వారికి మిశ్రమ కాలము వాయిదాల మీద కార్యములు చక్కబడును. భాగస్వాముల మధ్య విభేదములు పొడచూపును. కొన్ని ప్రాజెక్టులు ఆగిపోవును. ధైర్యము తగ్గును. అనారోగ్య సమస్యలు ఉన్ననూ శక్తిమేరకు ప్రయత్నించెదరు.

రాజకీయ నాయకులకు సామాన్యకాలము ప్రజా ప్రభుత్వ గుర్తింపు కొరకు తాపత్రయపడుదురు. మనుగడ కొంత కష్టనష్టములతో నుండగలదు. అవమానములు అపనిందలు ఎదుర్కొనవలసి వచ్చును. తరుచు ప్రయాణములు కలుగును.

NRIలకు మిశ్రమ కాలము ఉద్యో గములు పొగొట్టుకొని స్వదేశమునకు రాక తప్పదు. స్పెక్యులేషన్ లాభించదు.

2026-2027 కన్యరాశి: గ్రహశాంతి, అదృష్టసంఖ్య, అదృష్ట రత్నం & రుద్రాక్షధారణం

🙏 గ్రహశాంతి

ఈ సంవత్సరం రవి, కుజ, గురు, శని, రాహు, కేతు శాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి పరిశీలించండి.

🔢 అదృష్టసంఖ్య
5

1, 4, 6 మిత్ర సంఖ్యలు. 14, 23 తేదీలు ఆది, బుధ, శుక్రవారములు.

💎 అదృష్ట రత్నం

ఉత్తర-కెంపు, హస్త-ముత్యం, చిత్త-పగడం ధరించవలెను.

📿 రుద్రాక్షధారణం

చతుర్ముఖి, త్రయోదశముఖి, నవదశముఖి ధరించిన శుభం.

Kanya Rasi Phalalu 2026-2027 PDF Download

Get the high-resolution PDF - Kanya 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.


Rasi Phalalu 2026-2027 Copyrights: “BrahmaSri Pedagadi Mohana Ravishankar Daivagna”, Mobile: 9949598627. Read Disclaimer

ముఖ్య సూచన: ఈ కన్య రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.

» Telugu Festivals 2026 (IST)