Karkataka Rasi 2026-2027 Telugu Rasi Phalalu Yearly Horoscope

Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Karkataka Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.

కర్కాటకరాశి 2026-2027 Rasi Phalalu Banner
పునర్వసు (4), పుష్యమి (4), ఆశ్లేష (4) పాదాలు.
💰 ఆదాయం: 2, 💸 వ్యయం: 11, 👑 రాజ్యపూజ్యం: 4,🚫 అవమానం: 7

శ్రీ పరాభవ నామ సంవత్సరము నందు కర్కాటకరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుండును. అపరిమితమైన ధన వ్యయము కలుగును. ఋణవృద్ధి కలుగును. పాత ఋణములు తీర్చుటకు కొత్త ఋణములు చేయవలసి వచ్చును. ఆరోగ్యము మందగించును. తరచూ వైద్యశాలా దర్శనము ఔషద సేవనము చేయక తప్పదు. శారీరక మానసిక అశాంతితో సతమతమగుదురు. అజీర్ణ వ్యాధితో బాధ పడుదురు. బంధుమిత్రాదుల వలన సమస్యలు కలుగును. అనవసరముగా త్రిప్ప్పుట కాలయాపన దేశాంతర గమనము కలుగుచుండును. చేయు వృత్తి వ్యాపార ఉద్యో గాదులయందు స్థిరత్వము లేక స్థానభ్రంశము కలుగుచుండును. ఆరోగ్య కష్టములు పెరుగును. మనశ్ఛాంచల్యముతో ఇల్లు విడిచి వెళ్ళుట జరుగును. ఇంటియందు భార్య/భర్త సంతానముల మధ్య సమస్యలు కలుగును. మనోధైర్యము సడలును. మతిమరుపు బుద్ధిమాంధ్యముతో ప్రయాణముల యందు త్రప్పిపోవుట జరుగును. దూర ప్రయాణములు వాయిదా పడును. వాహన ప్రమాదములు, వాహనములు మొరాయించుట వంటి సమస్యలతో ఇబ్బంది పడుదురు. వివాహాది శుభకార్యములు అధిక ధనవ్యయము చేసిన మీదట పూర్తి అగును. మధ్యమధ్య ధనలాభము కలుగును. మనశ్శాంతి సంఘ గౌరవము కలుగును. విద్యాభివృద్ధి బంధుమిత్ర సౌఖ్యము కలుగును. ఆరోగ్యము సిద్ధించును. భూగృహ నిర్మాణాదికార్యములు సత్వరము పూర్తి చేయగలరు. పోలీసు, కోర్టు కేసులయందు కొంత వ్యతిరేతక వ్యక్తమగును. హంగు ఆర్భాటములకు అధిక ధనవ్యయము చేయుదురు.

2026-2027 కర్కాటకరాశికి సంవత్సర ప్రారంభమున అపరిమితమైన ధనవ్యయముతో సతమతమగుదురు. రాబడి తగ్గును. ఖర్చులు పెరుగును. నూతన ఋణములతో నెట్టుకొచ్చెదరు. చేసిన ప్రయత్నములు పురోగతి లేక మనశ్శాంతి తగ్గును. ఆరోగ్య పీడ కలుగును. కుటుంబ సమస్యలు పెరుగుటచే మనశ్శాంతి కరువగును. శతృపీడ కలుగును. బంధుమిత్రాదులతో సహకారము లేక అపవాదములనెదుర్కొనవలసి వచ్చును. పశు, క్షేత్ర నష్టములు కలుగును. స్థిరాస్తులు కరిగి పోవును. విలువైన వస్తువులు పొగొట్టుకొందురు. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు సమన్వయము లేక ఇబ్బంది పడెదరు. శారీరక మానసిక సౌఖ్యము తగ్గును. అనవసర ప్రయాణములతో ధనవ్యయము కలుగును. నమ్మినవారి వలన మోసములకు గురి అగుదురు. సంఘ గౌరవము తగ్గును. రాజకీయ పదవులు పొగొట్టుకొందురు. శస్తచికిత్సలు, వాహన ప్రమాదములు జరుగు సూచనలున్నవి. వివాహాది శుభకార్యములు వాయిదా పడును. భూ, గృహ నిర్మాణాది కార్యములు ఆగిపోవును. పోలీసు కోర్టు కేసులలో వ్యతిరేకత కలుగును.

2026-2027 కర్కాటకరాశికి సంవత్సర ద్వితీయ భాగమున మనశ్ఛాంచల్యము మనో వికారము కలుగును. అనాలోచిన నిర్ణయములతో బంధు మిత్రాదులతో కలహములు కలుగును. పదవీత్యాగములు ఉండును. ఇచ్చిన మాట నిలబెట్టుకొనలేరు. మతిభ్రమణముతో త్రిప్ప్పుట కలుగును. శత్రుపీడ, శత్రువృద్ధితో ఆందోళనక గురి కాగలరు. అభివృద్ధి నిలచిపోవును. విలువైన వస్తువులు పొగొట్టుకొందురు. ధనవ్యయము అపరిమితముగా ఉండును. సమయమునకు తగిన నిర్ణయములు చేయలేక పోవుటచే ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టును. శారీరక మానసిక వ్యధ కలుగును. వృధా సంచారము పరగృహ వాసము కలుగును. శక్తివంచన లేకుండా కృషి చేయుదురు. కాని ఫలితము ఆశించిన మేరకు రాకుండును. ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదములతో తలనొప్ప్పులు కలుగును. స్థిర చరాస్తుల విషయములో దాయదులతో కలహములు వచ్చును. పిత్రార్జితము సమయమునకు చేతికి అందకుండును. ఆస్తి తగాదాలతో కోర్టుల వరకు వెళ్ళును. మాట పట్టింపులు కలుగును.

2026-2027 కర్కాటకరాశికి సంవత్సర తృతీయ భాగమున అన్ని విధములా అనుకూలముగా నుండును. ఆర్ధిక వృద్ధి కలుగును. కీర్తి వృద్ధి సంఘ గౌరవము కలుగును. అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభముతో ఉత్సాహముగా నుందురు. ఆగిపోయిన కార్యములు సత్వరము నెరవేరగలవు. శరీర బలము పెరుగును. ముఖము నందు తేజస్సు వృద్ధి అగును. సర్వులు మీకు అణిగి మణిగి ఉండెదరు. శత్రునాశనము కలుగును. శత్రువులు మిత్రుల వలె సహకరించెదరు. గురుదేవతా దర్శనము చేయుదురు. మంత్ర సిద్ధి కలుగును. పుణ్య క్షేత్ర సందర్శనమతో ఆహ్లాదకరముగా నుందురు. వివాహాది శుభకార్యములు అప్రయత్నముగా నెరవేరును. భూ, గృహ నిర్మాణాది కార్యములు సిద్ధించును. నూతన క్షేత్ర వృద్ధి, పశు వృద్ధి కలుగును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదులయందు ఉన్నతి గౌరవము కలుగును. మీ ఆజ్ఞ సర్వులు శిరసా వహించగలరు. ప్రభుత్వ పరమైన అనుమతులు సత్వరము పొంది కార్యములు చక్కబెట్ట కొనగలరు. అభివృద్ధికి బాటలు వెసెదరు. ఆరోగ్య సిద్ధించును. విదేశీ వస్తు సంచయము సమకూర్చుకొందురు. మృష్టాన్నభోజనము చేయుదురు. రాజకీయ పదవీ యోగము కలుగును. కీర్తి గౌరవ ప్రతిష్టలు పెరుగును. సుఖ సంతోషములతో నుండెదరు.

2026-2027 కర్కాటకరాశికి సంవత్సరాంతమున పురోగతి మందగించును. ఆరోగ్యలోపములతో సతమతమయ్యెదరు. శారీరక మానసిక ఒత్తిడితో మనోధైర్యము తగ్గును. శక్తి చాలక చేయవలసిన పనులు వాయిదా వేసెదరు. మనోవ్యధ మనశ్చాంచల్యంతో అన్ని కార్యముల యందు వ్యతిరేకత వ్యక్తమగును. బంధుమిత్రాదులతో సంఘర్షణలకు లోనగుదురు. మర్యాదకు హాని కలుగును. వివాహాది శుభకార్య నిర్వహణ యందు పురోగతి మందగించును. కొన్ని కార్యములు పూర్తి చేయుటలో అపరితమైన ధనవ్యయము కలుగను. అనవసర సంచారము చేయుదురు. శత్రుబాధ పెరుగును. మిత్రులు సమయానికి కలసిరాక ఇబ్బందులు సృష్టించెదరు. దూరప్రాంత ప్రయాణములు విదేశీ ప్రయాణములు ఆగిపోవును. నూతన విద్య ఉద్యోగ ప్రయత్నములకు ఆటంకము కలుగును. మతిభ్రమణముతో సర్వులతో కలహ వాతావరణముండును. భార్య/భర్త సంతానముల మధ్య సఖ్యత లేక మనశ్శాంతి లోపించును. దేశ సంచారము చేయుదురు. ద్రవ్య నాశనము కలుగును. శత్రుభీతి కలుగును. పోలీసు కోర్టు కేసులయందు వ్యతిరేక ఫలితములు కలుగును. ప్రభుత్వ అధికారులతో సమస్యలు కలుగును.

విద్యార్దులకు మిశ్రమ కాలము. కష్టముకు తగిన ప్రతిఫలము లేకుండును. అతికష్టము మీద కొంత వరకు నెగ్గుకొచ్చెదరు. ర్యాంకులు తృటిలో తప్పిపోవును. నిరాశకులోనగుదురు.

నిరుద్యోగులకు నిరాశాకాలము వృధా సంచారము అనవసర ప్రయాణములు చేయుదురు. ఆరోగ్య లోపములు ఉండును. శక్తి క్షీణించును. ఆర్ధిక మోసములకు గురి అగుదరు.

ఉద్యోగులకు వ్యతిరేక కాలము. తరచు స్థానభ్రంశములు కలుగును. పై అధికారుల వలన మాట పడక తప్పదు. ప్రమోషన్లు నిలచిపోవును. దూరప్రాంత బదిలీలు జరుగును. సస్పెన్షన్లు ఎదుర్కొందురు.

వ్యాపారులకు అనుకూలకాలము కాదు. వ్యాపార నష్టములు వచ్చును. నూతన ప్రయత్నములు ఫలించవు. స్థానచలనము చేయవలసి వచ్చును. ఆటంకములు కలుగును.

కార్మికులకు అత్యంత కఠినమైన కాలము పనికి తగిన గుర్తింపు లేకుండును ఆర్ధిక సమస్యలు కలుగును. సరిఅయిన పనిలేక ఆదాయము తగ్గును. వృధా సంచారము కలుగును. గుర్తింపు తగ్గును.

వ్యవసాయదారులకు ప్రకృతి వైపరీత్యములతో చీడపీడల సమస్యలతో చికాకులు కలుగును. పశు క్షేత్ర వృద్ధి లేకుండును. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టును. ఆదాయము తగ్గును.

ఆక్వాకల్చర్ వారికి శ్రమకు తగిన ఫలితము రాకుండును. స్థానచలనముకలుగును. నష్టముల బాటపట్టెదరు. నమ్మిన వారి వలన మోసములకు గురి అగుదురు. భాగస్వాముల మధ్య అభిప్రాయ బేధములు కలుగును.

కవులు, కళాకారులు గౌరవ మర్యాదలు తగ్గును. ఆర్ధిక వ్యవహారములు మందగించును. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టును తగిన ప్రోత్సాహములేక సతమతమగుదురు.

సినిమారంగము పూర్తిగా నష్టముల బాట పట్టును. ఆర్ధిక లావాదేవీలు మందగించును. ఆర్ధిక మోసములతో నష్టములు పాలగుదురు. ఆఫర్లు రాక ఋణములతో నెట్టుకొచ్చెదరు.

రాజకీయ నాయకులకు సమస్యల కాలము.ఆర్ధికముగా నష్టపోవుదురు. సంఘపరమైన గుర్తింపు తగ్గును అపఖ్యాతి మూటగట్టుకొందురు. ప్రజా ప్రభుత్వ వ్యతిరేకతతో పదవీ భంగముకలుగును. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుదురు.

NRIలకు పుర్తి వ్యతిరేక కాలము. ప్రయాణములు మద్యలో ఆగిపోవును. చివరి నిమిషములలో ప్రయాణములు రద్దు అయ్యి వెనుకకు వచ్చే అవకాశం కలదు. స్పెక్యులేషన్ లాభించదు.

2026-2027 కర్కాటకరాశి: గ్రహశాంతి, అదృష్టసంఖ్య, అదృష్ట రత్నం & రుద్రాక్షధారణం

🙏 గ్రహశాంతి

ఈ సంవత్సరమంతయూ గురు, శని, రాహు, కేతు, కుజ గ్రహశాంతులు ఆచరించవలయును. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.

🔢 అదృష్టసంఖ్య
2

1, 4, 7 మిత్ర సంఖ్యలు ఆది, సోమవారములు కలిసిన శుభం

💎 అదృష్ట రత్నం

పునర్వసు-పుష్యరాగం, పుష్యమి-నీలం, ఆశ్లేష-పచ్చ ధరించవలెను

📿 రుద్రాక్షధారణం

ద్విముఖి, ఏకాదశముఖి, గర్భగౌరీ ధరించవలెను.

Karkataka Rasi Phalalu 2026-2027 PDF Download

Get the high-resolution PDF - Karkataka 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.


Rasi Phalalu 2026-2027 Copyrights: “BrahmaSri Pedagadi Mohana Ravishankar Daivagna”, Mobile: 9949598627. Read Disclaimer

ముఖ్య సూచన: ఈ కర్కాటక రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.

» Telugu Festivals 2026 (IST)