Kumba Rasi 2026-2027 Telugu Rasi Phalalu Yearly Horoscope

Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Kumba Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.

కుంభరాశి 2026-2027 Rasi Phalalu Banner
ధనిష్ఠ (3,4), శతభిషం (4), పూర్వాభాద్ర (1,2,3) పాదాలు.
💰 ఆదాయం: 2, 💸 వ్యయం:8, 👑 రాజ్యపూజ్యం: 4,🚫 అవమానం: 2

శ్రీ పరాభవ నామ సంవత్సరమునందు కుంభరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయూ ఏలినాటి శని ప్రభావముచే మనోధైర్యములేక అశాంతితో సతమతమగుదురు. మనోభీష్టములు వాయిదాపడును. ధనక్షయము అధికముగా నుండును. సర్వులతో విరోధము కలుగును. ఆర్ధిక ఇబ్బందులతో సమస్యలు కలుగును. మీకన్నా తక్కువారి వద్ద చేయు చాపవలసి వచ్చును. బంధుమిత్ర విరోధములు కలుగును.శత్రు భయము కలుగును. అవమానములు ఎదుర్కొనవలసి వచ్చును. ఆరోగ్యము మందగించును. వృధా ఖర్చులు పెరుగును. వైద్యాశాలా దర్శనము తరచూ చేయవలసి వచ్చును. ఔషదసేవనము నిత్యకృత్యమగును. అభివృద్ధి కానరాకుండును. సమస్యలతో విసిగి వేసారిపోయేదరు. అధిక ధనవ్యయము చేసిన మీదట కొన్ని కార్యములు ఆలస్యము మీద పూర్తి చేసేదరు. సమయానికి బంధుమిత్రాదులు కలిసి రాకుండుటచే మాట నిలబెట్టుకోలేని పరిస్థితి కలుగును. అధిక శ్రమతో అరకొరగా పనులు పూర్తి అగును. భార్యభర్తల మధ్య అపోహలకు దారితీయును. సంతాన సౌఖ్యము తగ్గును. సంఘ గౌరవము తగ్గును. కొన్ని కార్యముల యందు విజయము కలుగును. ధనాదాయము సామాన్యముగా నుండును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు లాభార్జన సామాన్యముగా నుండును. ప్రభుత్వ పరమైన అనుమతులు ఆలస్యముగా నెరవేరును. వృధా సంచారము త్రిప్ప్పుట జరుగును. చిన్న చిన్న ప్రమాదములు ఎదుర్కొనవలసి వచ్చును. వస్తువాహనములు పాడగుటచే నూతన వస్తువులు సమకూర్చుకొనవలసి వచ్చును. దొంగల భయము కలుగును. విలువైన వస్తువులు తస్కరించబడుట కనబడకుండా పోవుటచే ఆందోళన చెందుదురు. ప్రభుత్వ పరమైన నోటీసులు వచ్చును.

2026-2027 కుంభరాశికి సంవత్సర ప్రారంభమున అన్ని విధములా అనుకూలముగా ఉండగలదు. తలచిన కార్యములన్నియూ ఆలస్యము మీద నెరవేరును. వాయిదాల మీద కార్యక్రమ నిర్వహణ జరుగును. ధనాదాయము బాగుండును. బంధుమిత్ర సౌఖ్యము కలుగును. చేయ వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు అనుకూలత కలిగి అభివృద్ధికి బాటలు వేయుదురు. సహచరులతో స్నేహ లాభముండును. ఆర్ధికముగా నిలదొక్కుకుందురు. పోలీసు కోర్టు కేసుల యందు రాజీ ధోరణితో పరిష్కారములు జరుగును. సర్వులతో స్నేహ భావము కలుగును. ఇంటియందు భార్యభర్తల మధ్య సఖ్యత నెలకొనును. సంతాన సమస్యలు విజయవంతముగా పరిష్కరించబడును. శక్తిమేరకు కృషిచేయుచు మనోనిబ్బరము కలిగియుందురు. శారీరక శ్రమ పెరుగును. ఫలితములు ఆశించక నిజాయితీతో పనిచేసి అందరిని మెప్పించగలరు. దేశ విదేశ పర్యటనలు చేయుదురు. గురుదేవతా దర్శనము పుణ్య తీర్ధ గమనము కలుగును. మానసిక శారీరక ధృడత్వము తగ్గిననూ ఔషద సేవనముతో సరిచేసుకొందురు. శరీర ఆరోగ్యరిత్యా వైధ్యశాలా దర్శనము తప్పని సరిఅగును. నీరసం నిస్సత్తువతో ఇబ్బంది పడుదురు.

2026-2027 కుంభరాశికి సంవత్సర ద్వితీయ భాగమున ధనవ్యయము అధికముగా నుండగలదు. 1కి 10 రూపాయలు ఖర్చు అగును. సొమ్ము ఇవ్వనిదే ఎవ్వరూ పనిచేయని పరిస్థితి కలుగును. బంధుమిత్రాదుల సైతం వ్యతిరేకముగా నుండును. ఆదాయ వ్యయముల మధ్య పొంతన లేకుండును. కొత్త వస్తువులు సైతము పనికి రాకుండా పోవుటచే మరలా వస్తుసేకరణకు ఖర్చులు చేయవలసి వచ్చును. ఇంటియందు కలహవాతావరణము కలుగును. బ్యాంకులు ఇన్సూరెన్సులు గ్యారంటీలు విషయములో మోసములకు గురి అగుదురు. భార్యభర్తల మధ్య సఖ్యత తగ్గును. శత్రుభయము కలుగును. శారీరక మానసిక ఆరోగ్యము సహకరించక శక్తి క్షీణించును. అన్నికార్యముల యందు అభివృద్ధి నిరోధకముగా నుండును. సువర్ణ రజితాది విలువైన ఆభరణములు తస్కరణకు గురి అగును. విలువైన డాక్యుమెంట్లు పోగొట్టు కొందురు. ఇంటియందు బూజులు శిలీంద్రములు చెదలు వంటి సమస్యలు కలుగును. మనోవ్యాధి పెరుగును. పోలీసు కోర్టు కేసులు కొలిక్కి రాక ఇబ్బందులు కలుగును. అందుబాటు ఉన్న నిధులు సైతము సమయానికి అక్కరకు రాకుండును, నిధుల దుర్వి నియోగం కలుగును. దుష్ట సాంగత్యము మోసకారుల సహవాసము కలిగి అమర్యాదకు లోనగుదురు. సజ్జనులతో శత్రుభావము కలుగును. ప్రమాదములు ఎదుర్కొందురు.

2026-2027 కుంభరాశికి సంవత్సర తృతీయ భాగమున భోగలాలాసత పెరిగిపోవును. నూతన పర్యటనలు చేయుచు ధనము అధికముగా ఖర్చు అగును. భార్యభర్తల మధ్య పొరపొచ్చములు కలుగును. ప్రభుత్వ పరమైన అనుమతులు అలస్యము మీద వచ్చును. మనోభీష్టమునకు వ్యతిరేకముగా కార్యములు జరుగును. శుభకార్య నిర్వహణ కష్టముగా కొనసాగును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు సానుకూల ధోరణితో సహచరులతో మైత్రి భావముతో మెలగుదురు. సంఘపరమైన సమస్యలలో పరిష్కారముల కొరక వేచి చూడక తప్పదు. భూగృహ నిర్మాణాది కార్యములు కొనసాగించ గలరు. క్షేత్రవృద్ధి కలుగును. భృత్యు కలహములు కలుగును.

2026-2027 కుంభరాశికి సంవత్సరాంతమున ధనవృద్ధి కలుగును. పొగడ్తలకు లొంగిపోవుదురు. అనవసర విషయములపై దృష్టి పెట్టుటచే అభివృద్ధి మందగించును. ధనాదాయము అనుకూలముగా నుండుటచే ఎవరిని లక్ష్యపెట్టక మొండిగా నుందురు. సజ్జనులతో ద్వేషభావము కలుగును. ఋణములు చేసి దుబారా చేయుదురు శత్రుభాధ పెరుగను. శత్రువులను కట్టడి చేయలేక నీరసించి పోవుదురు. వ్యాధి భయము కలుగును. హఠాత్తుగా వచ్చిన సమస్యలతో ఆర్ధికముగా వెనుకబడిపోయెదరు. పెద్దమొత్తంలో సోమ్ము పోగొట్టుకొందురు. శరీర పోషణ తగ్గును. శారీరక మానసిక వ్యాధి తగ్గును. నేత్రబాధ కంటి ఆపరేషన్లు నేత్రములకు దెబ్బలు తగులుట, చూపు మందగించుట వంటి సమస్యలు కలుగును. సకల కార్యవిఘ్నములతో అశాంతితో నుందురు. ధైర్యముతో పరిస్థితులను ఎదుర్కొని పోరాడుదురు. దేశ విదేశ సంచారము చేయుదురు. బంధుమిత్రాదులు చిన్నచూపు చూచెదరు. ఇంటియందు సమస్యలతో కలత చెందుదురు. ఇంటాబయట జగడములు కలుగును. పూర్వార్జితము కరిగిపోవును.

విద్యార్దులకు పూర్తి వ్యతిరేక కాలము. మందగమనము మతిమరుపులతో చదివినవి రాక ఇబ్బంది పడుదురు. అత్తెసరు మార్కులతో సరిపెట్టుకొనవలసి వచ్చును. నిరాశ తప్పదు. రెండు చాన్సులలోను వ్యతిరేకత కలుగును.

నిరుద్యోగులకు నిరాశా కాలము మరికొంత కాలము వేచిచూడక తప్పదు. చేసిన శ్రమ ఫలితములనివ్వక ఆందోళనకు గురి అయ్యేదరు. ఆర్ధిక మోసములకు అవకాశమున్నది. దుర్విశనములకు లోనగుదురు.

ఉద్యోగులకు కత్తిమీద సాము వలె నుండును. పై అధికారులతో వాగ్వివాదములు మాట పట్టింపులతో సమస్యలు కలుగును. సహచరులతో కలహములు. అయిష్టబదిలీలు కలుగును. ప్రమోషన్లు నిలచిపోవును.

వ్యాపారులకు అభివృద్ధి నిరోధకముగా నుండగలదు. వ్యాపార సంస్థలు మూతపడును. స్థానభ్రంశము, స్థాననాశనము కలుగును. వ్యాపార విస్తరణకు ఆటంకములు కలుగును. భాగస్వాముల మధ్య విభేదములు కలుగును.

కార్మికులకు శ్రమ కాఠిన్యము పెరుగును. శారీరక అలసటతో ఆరోగ్య లోపములతో ఇబ్బందులు కలుగును. ఋణ సమస్యలు చుట్టుముట్టును. వృధా సంచారము వృధా ప్రయాస కలుగును.

వ్యవసాయదారులకు చీడపీడల సమస్యలు కలుగును. అనుకున్న దిగుబడులు సాధించలేక చతికల పడుదురు. ఋణభారము పెరుగును. క్షేత్ర నాశనము కలుగును. స్థిరచరాస్తులు కరిగిపోవును.

ఆక్వాకల్చర్ వారికి ఇబ్బందులు పాలగుదురు. అనూహ్యపరిణామములతో ఆర్దిక వ్యవస్థ కుదేలు అగును.

కవులు, కళాకారులు నిరాశాకాలము సంఘ గౌరవము తగ్గును. అపవాదములు అవమానములతో కలత చెందుదురు.

సినిమారంగము చేసిన ప్రయత్నములు ఫలించక నిరాశ చెందుదురు. కొత్త ప్రాజెక్టులు ఆగిపోవును.

రాజకీయ నాయకులకు పదవీత్యాగము కలుగును. ప్రజాప్రభుత్వ మద్దతు లభించదు. అవమానములు కలుగును. పదవులకు రాజీనామా చేయవలసి వచ్చును. ప్రభుత్వ పెద్దలతో వాగ్వివాదములు కలుగును.

NRIలకు ఉద్యోగభంగములతో స్వదేశమునకు రాక తప్పదు. ఆర్ధిక నష్టములతో ఆరోగ్యలోపములతో ఇబ్బంది పడుదురు. స్పెక్యులేషన్ లాభించదు.

2026-2027 కుంభరాశి: గ్రహశాంతి, అదృష్టసంఖ్య, అదృష్ట రత్నం & రుద్రాక్షధారణం

🙏 గ్రహశాంతి

ఈ సంవత్సరం రాహు, కేతు, గురు, శని, కుజ గ్రహశాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.

🔢 అదృష్టసంఖ్య
8

5, 6 మిత్ర సంఖ్యలు. ప్రతినెలా 8, 17, 26 తేదీలు బుధ, శుక్ర, శనివారాలు కలిసిన మరింత శుభము.

💎 అదృష్ట రత్నం

ధనిష్ట-పగడం, శతభిషం-గోమేధికం, పూర్వాభాద్ర-పుష్యరాగం.

📿 రుద్రాక్షధారణం

సప్తముఖి, అష్టముఖి, షష్టదశముఖి, సప్తదశముఖి ధరించిన శుభం.

Kumba Rasi Phalalu 2026-2027 PDF Download

Get the high-resolution PDF - Kumba 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.


Rasi Phalalu 2026-2027 Copyrights: “BrahmaSri Pedagadi Mohana Ravishankar Daivagna”, Mobile: 9949598627. Read Disclaimer

ముఖ్య సూచన: ఈ కుంభ రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.

» Telugu Festivals 2026 (IST)