Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Makara Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.
శ్రీ పరాభవ నామ సంవత్సరము నందు మకరరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభాధిక మిశ్రమ ఫలములతో ఆనందముగా నుందురు. అవకాశములు అప్రయత్నముగా వచ్చును. అదృష్టము వచ్చి తలుపు తట్టును. అన్నింటా విజయములతో కార్యశూరులుగా నుందురు. నిబద్దత నిజాయితీతో సంఘములో పేరు తెచ్చుకొందురు. మనోధైర్యము పెరుగును. అధిక ధనాదాయముతో సకల సౌఖ్యములను అనుభవవించగలరు. ధనవ్యయము ఎక్కువగా నుండును. తగిన పరిశ్రమతో ఉన్నత శిఖరములు చేరుటకు తగిన ప్రణాళికలు రూపోందించి సత్ఫలితములు పొందగలరు. భూలాభము క్షేత్ర లాభము, పశు, గో గణాభివృద్ధి కలుగును. భూ గృహ నిర్మాణాది కార్యములు సాధించగలరు. ఇంటి యందు శుభకార్య నిర్వహణ చేయుదురు. అధిక ధనవ్యయముతో భోగలాలసతో నుందురు. బంధుమిత్రాదులకు సహయ సహకారములు అందించెదరు. కొన్ని విషయముల యందు భార్యభర్తల మధ్య అభిప్రాయ బేధములు కలుగును. బంధువులతో విభేదించి కార్యములు చేయుదరు. దొంగల భయము కలుగును. శత్రువులు మీ పట్ల అసూ యతోనుందురు. కాని ఏమి చేయలేక మిన్నకుండిపోయేదరు. ఆరోగ్యము మందగించును. ఔషద సేవనము చేయవలసి వచ్చును. ప్రభుత్వ అధికారులతో పెద్దలతో వాగ్వివాదము చోటు చేసుకొనును. సంతాన మూలక సమస్యలు కలుగును. అగ్నిభయము, ప్రకృతి వైప రీత్యముల వలన నష్టముల పాలగుదురు. విలువైన వస్తువులు పాడగుట, కోల్పోవుట జరుగును. ఆదాయ మార్గములు అనుకూలముగా నుండుటచే మొండిగా ముందుకు పోయేదరు. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు అభివృద్ధి కలుగును. పలువురకు మార్గదర్శకులుగా నుందురు. నూతన పదవీయోగము కలుగును. శరీర పోషణ కలుగును.
2026-2027 మకరరాశికి సంవత్సర ప్రారంభమున ధనవ్యయము అధికముగా నుండును. శక్తికి మించిన పనులు చేయుదురు. ఆదాయ వ్యయముల యందు తేడాలు ఉండుటచే ఆందోళన జనించును. శత్రు పీడ పెరుగును. శత్రువులపై విజయము సాధించగలరు. సోదర సోదరీల సహకారము లభించగలదు. బ్యాంకు ఋణములతో అభివృద్ధి కార్యములు చేసేదరు. దేహసౌఖ్యము కలుగును. కీర్తి గౌరవ ప్రతిష్టలతో మెలగుదురు. వాక్పౌరుషము కలుగును. అనారోగ్య లోపములచే ఔషద సేవనము చేసేదరు. జంతుభయము పశునాశనము కలుగును. ప్రయాణ విఘ్నములు వాహన ప్రమాదములు సంభవించును. పోలీసు కోర్టు కేసులయందు తటస్థ వైఖరి రాజీ ధోరణీతో సానుకూలము చేసుకొనగలరు. భాగస్వాముల మధ్య విభేదములు కలిగి మీదే పైచేయి అగును. సంఘ కార్యములకు విరాళములు ఇచ్చెదరు.
2026-2027 మకరరాశికి సంవత్సర ద్వితీయ భాగమున మంగళప్రధమైన శుభకార్యములు చెసెదరు. బ్రహ్మచారులకు వివాహాది శుభకార్యములు జరిగి ఆనందముగా నుందురు. ఆగిపోయిన, వాయిదా పడిన కార్యములు అప్రయత్నముగా పూర్తి అగును. దేహసౌఖ్యము కలుగును. భార్య భర్తల మధ్య అనుమానములు తొలగి అనురాగ జీవనము కలుగును. పుత్ర సంతాన యోగముతో ఆనందముగా నుందురు. సోదర సోదరీ సౌఖ్యము కలుగును. స్థిర చరాస్థిలు అభివృద్ధి చెసెదరు. ప్రభుత్వాధినేతలతో సత్సంబదములు కలిగి కార్య నిర్వహణ పూర్తి చేయగలరు. పోలీసు కోర్టు కేసులలో అనుకూలతలు కలుగును. శత్రుభాధ నశించును. నూతన వస్తువాహన సామాగ్రి సువర్ణ రజిత ఆభరణములు సమకూర్చుకొందురు. ప్రయాణములు అనుకూలించును. బంధుమిత్ర సహకారము లభించును.
2026-2027 మకరరాశికి సంవత్సర తృతీయ భాగమున శతృపీడ పెరుగును. మీ వ్యతిరేకులు అంతా ఒక్కటిగా మీపై దాడి చేయగలరు. అయిననూ చలించక ధీటుగా ఎదుర్కొందురు. మానసిక ధైర్యముతో సమస్యలు పరిష్కరించుకొనగలరు. శరీర ఆరోగ్యము మందగించును. వైధ్యశాలా దర్శనము ఔషద సేవనం తప్పని సరి అగును. ప్రభుత్వ పెద్దలతో సఖ్యత చెడి మాట పట్టింపులతో సమస్యలు కలుగును. జరిమానాలు కట్టవలసి వచ్చును. ఆదాయము తగ్గుటతో ఆందోళన చెందెదరు. దొంగల భయముతో విలువైన వస్తువులు తస్కరణకు గురి అగును. మతి మరుపుతో విలువైన వస్తువులు డాక్యుమెంట్లు కనిపించక పోవుటతో ఆందోళనకు గురి అగుదురు. బ్యాంకు లావాదేవీల యందు సమస్యలు కలుగును. సాంకేతిక సమస్యలతో నష్టపోవుదురు. మార్కెట్ మాయాజాలంతో ధననష్టము కలుగును. పెట్టుబడులు సమయానికి అక్కరకు రాకుండును. అగ్ని భయము. విద్యుత్ షాక్‌లతో ఇబ్బంది పడెదరు. వృధా ఖర్చులు పెరుగును. పాప చింతన కలుగును. దేహము సొంపు చెడును. గాంభీర్యము తగ్గును. తెగువ కోపము కలుగును. బంధుమిత్రాదులు దూరమయ్యెదరు. గౌరవ ప్రతిష్టలు మసకబారును. లక్ష్యసిద్ధి తగ్గి చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు సమస్యలు కలుగును. సహచరుల మధ్య బాగస్వాముల మధ్య విభేదములు పొడచూపును. ఋణభారము పెరుగును.
2026-2027 మకరరాశికి సంవత్సరాంతమున సకల కార్యసిద్ధి కలుగును. మనోధైర్యము పెరుగును. సకల సమృద్ధి కలిగి సంతోషముగా నుందురు. పోయిన వస్తువులు తిరిగి వచ్చి చేరును. బంధుమిత్రాదులు తప్ప్పు తెలుసుకుని మీ వద్దకు చేరెదరు. ఆరోగ్యము కలుగును. దేహ సౌఖ్యము కలిగి శారీరక మానసిక శక్తి పెరిగి ఆనందముగా నుందురు. ప్రభుత్వ అధికారులతో మాట కలియును. ప్రభుత్వ అనుమతులు సత్వరము సాధించుకొనెదరు. పోలీసు కోర్టు కేసులలో అనుకూలతలు పెరుగును. శత్రుబాధ తొలగును. బంధుమిత్రాదుల ప్రోత్సాహముతో సకల కార్యసిద్ధి జరుగును. అప్రయత్న ద్రవ్య లాభము కలిగి లాభార్జన చేయుదురు. భార్యభర్తల మధ్య అపోహలు తొలగి ప్రేమానురాగములు వర్ధిల్లును. నూతన బాంధవ్యములు అనుకూలించును. ఇంటియందు వివాహాది శుభకార్యములు చెసెదరు. సంతాన యోగము కలుగును. హృదయ సుఖము స్వకార్య సిద్ధి స్వస్థల ప్రాప్తి కలుగును. భూలాభము క్షేత్ర వృద్ధి గో పశువృద్ధి కలుగును. బంధుమిత్రాదులతో దేశ విదేశ పర్యటనలు చేసెదరు. మనోధైర్యము పెరిగి సహచరులతో సత్సంబంధములు కలుగును. నూతన వస్తు, వాహన వస్త్ర సంచయము చేకూరును. వ్యాపార అభివృద్ధి కలుగును. భృత్యులు సహకరించెదరు.
విద్యార్దులకు అనుకూల కాలము. మంచి మార్కులతో విజయము సాధించ గలరు. అవార్డులు రివార్డులు పొందగలరు. స్టేట్ ర్యాంకులు పొందుటకు అనుకూల కాలము. అనూహ్యముగా అందలం ఎక్కెదరు.
నిరుద్యోగులకు ఆశావహ కాలము. చేసిన కృషికి తగిన ఫలితము దక్కును. మంచి ప్యాకేజీలతో ప్రఖ్యాతి సంస్థలలో అవకాశములు వచ్చును.
ఉద్యోగులకు ప్రమోషన్లు అనుకున్న ప్రాంతములకు బదిలీలు జరుగును. అభివృద్ధికరమైన కాలము. పై అధికారులు మీ మాటకు విలువనిచ్చి మీకు అనుకూలముగా నిర్ణయములు చేయుదురు.
వ్యాపారులకు ధనాదాయము బాగుండును. వ్యాపారము ప్రోత్సాహకరముగా నుండగలదు. నూతన వ్యాపార అభివృద్ధి జరిగి ఉత్తేజకరముగా నుండగలరు.
కార్మికులకు శరీర ధారుడ్యము పెరుగును. శ్రమ తగ్గును. గుర్తింపు లభించగలదు. కృషికి తగిన ఆదాయము లభించును. అభివృద్ధి బాటలో నడిచెదరు. కుటుంబ జీవనము ఆనందకరముగా నుండగలదు.
వ్యవసాయదారులకు క్షేత్రాభివృద్ధి కలుగును. చీడపీడల బాధ తప్ప్పును. లాభార్జన చేయగలరు. నూతన క్షేత్రములు అభివృద్ధి పరచగలరు. కృషికి తగిన ప్రోత్సాహము.
ఆక్వాకల్చర్ వారికి ధనాదాయము కలుగును. శారీరక మానసిక సౌఖ్యము కలుగును. ధనవృద్ధిచే నూతన కార్యసాధనలో సఫలీకృతము కాగలరు.
కవులు, కళాకారులు సన్మాన సత్కారములు కలుగును. సంఘ గౌరవము పెరుగును. నూతన ఆవిష్కరణలు చేయుదురు. మానసికొల్లాసముతో నుందురు. కుటుంబ జీవనము సాఫల్యము కాగలదు. ప్రజా ప్రభుత్వ గుర్తింపు పొందగలరు.
సినిమారంగము తక్కువ బడ్జెట్‌తో ప్రారంభించిన వారు సైతము అనూహ్యముగా మిలియనీర్లు కాగలరు. దేశ, ప్రపంచ వ్యాప్త అవార్డులు పొందగలరు.గుర్తింపు లభించును. అందరి దృష్టిని ఆకర్షించగలరు.
రాజకీయ నాయకులకు అత్యంత గౌరవ మర్యాదలు పొందుదురు. ప్రజా, ప్రభుత్వ గుర్తింపుతో నూతన రాజకీయ పదవీయోగం సిద్ధించును. ధనాదాయము బాగుండును. అభివృద్ధి కలుగును.
NRIలకు అనుకూల కాలము. విదేశీయాన అవకాశములు పొందగలరు. స్పెక్యులేషన్ లాభించును.
ఈ సంవత్సరం రవి, బుధ, రాహు, కేతు, గురు గ్రహశాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.
5 ,6 మిత్ర సంఖ్యలు. ప్రతినెలా 8, 17, 26 తేదీలు బుధ, శుక్ర, శనివారాలు కలిసిన మరింత శుభము.
ఉత్తరాషాడ-కెంపు, శ్రవణం-ముత్యం, ధనిష్ట-పగడం.
అష్టముఖి, నవముఖి, సప్తదశముఖి, షష్టదశముఖి, గణేశరుద్రాక్ష.
Get the high-resolution PDF - Makara 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.
ముఖ్య సూచన: ఈ మకర రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.