Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Mesha Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.
మేషరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ పరాభవ సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుందురు. ఏలినాటి శని ప్రభావముతో ధనక్షయము అపరిమితముగా నుండగలదు. అనుకున్న పనులన్నియూ వాయిదాలు పడుటచే మనో వ్యాకులతతో నుందురు. ఆర్ధిక క్రమ శిక్షణ లేక ఋణముల పాలగుదురు. మిత్రులు శత్రువుల వలె బాధించెదరు. శత్రు బాధ పెరుగును. నీలాపనిందలు పడవలసి వచ్చును. సంబందము లేని విషయములలో తలదూర్చుటచే అనవసర సమస్యలు కొని తెచ్చుకుందురు. పోలీసు కోర్టు కేసులయందు వ్యతిరేక ఫలితములతో సతమతమగుదురు. ఆర్ధికముగా వెనుకంజ వెయుదురు. కుటుంబ సమస్యలుపెరుగును. ఋణ బాధ పెరుగును. ఆరోగ్యము మందగించును. సర్యకార్యములు నిలిచిపోవును. ఇంటి యందు జరుగవలసిన శుభకార్యములు వాయిపడుట లేదా హఠాత్తుగా ఆగిపోవుట జరుగును. భూ, గృహ నిర్మాణాది కార్యక్రమములు నత్తనడక నడుచును. విద్య ఉద్యోగ వ్యాపారాదులయందు వాయిదాలతో చికాకులు కలుగును. మధ్య మధ్య కొంత అనుకూల పవనములు వీచును. ఆరోగ్యము కుదుట పడును. ఔషధ సేవనముతో ఉపశమించును. మనోధైర్యము కలిగి ముందుకు సాగగలదు. మిత్ర సౌఖ్యముతో కొన్ని కార్యములు ఆలస్యము మీద నెరవేర్చుకుందురు. అనుకున్న ఋణములు లభించి ఆర్ధిక కష్టముల నుండి బయట పడగలరు. సాముదాయకముగా కష్టనష్టములతో నడుచును. శ్రమ పెరుగును. శారీరక మానసిక అలసట పెరుగును. శత్రుత్వము పెరుగును. హఠాత్పరిణామములతో ఇబ్బందులు పడుదురు.
2026-2027 మేష రాశికి సంవత్సర ప్రారంభమున మిశ్రమ ఫలితములతో ముందుకు సాగగలదు. బంధువులతో విరోధములు కలుగుచుండును. చిత్తచాంచల్యము అనారోగ్య పీడలతో నుందురు. సంతాన మూలక సమస్యలు కలుగును. ఉమ్మడి కుటంబముల మధ్య విరోధములు కలిగి విడిపోవుదురు. ఇంటియందు పశువులు తప్పిపోవును. వాహన ప్రమాదములు కలుగును. వాహనములకు పోలీసు జరిమానాలు కట్టవలసి వచ్చును. మర్యాద తగ్గును. సంఘ గౌరవము తగ్గి పదవీ త్యాగం కలుగును. ఋణ బాధలు పెరుగును. మంచికి పోతే చెడు ఎదురగును. మధ్యవర్తిత్వములో మాట పడవలసిన వచ్చును. దగ్గరి బంధువులు స్నేహితుల వలన ఇబ్బందులు పడుదురు. అవసరమునకు తగిన ఆర్ధిక వనరులు అందుబాటులో లేక మరిన్ని ఋణములు చేయవలసి వచ్చును. అనారోగ్య బాధలు కలుగును. ఇంటి యందు పెద్దవయసు వారి ఆరోగ్యము క్షీణించుటచే ఒత్తిడికి లోనగుదురు. మధ్య మధ్య కొంత ధైర్యము కలుగును. మిత్రుల కలయికతో ఉపశమనము పొందుదురు. వైద్యశాలా దర్శనము ఔషద సేవనముతో ఆరోగ్యము కుదుట పడును. మానసిక స్థిరత్వము కలుగును.
2026-2027 మేష రాశికి సంవత్సర ద్వితీయ భాగమున శారీరక మానసిక అలజడితో నుందురు. బుద్ధి చాంచల్యము, తేజోహీనము, ద్రవ్యనాశనము, దేశ త్యాగము కలుగును. తరచుగా అనవసర ప్రయాణములు కలుగును. దూర దేశ ప్రయాణములు యందు వ్యతిరేక ఫలితములు కలుగను. ఇంటియందు ముఖ్యమైన వస్తువులు పాడగుటచే అనవసర దుర్వ్యయము కలుగును. ఆరోగ్యము మందగించును. తరుచు వైద్యశాల దర్శనము చేయవలసి వచ్చును. అభిప్రాయ బేధములతో విభేదములు కలుగును. వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రదేశముల యందు ఉద్యో గులతో వ్యతిరేకత కలుగును. కొన్ని వాణిజ్య సంస్థలు మూత పడును. భార్య భర్తల మధ్య అభిప్రాయ బేధములు కలుగును. సంతాన మూలక సమస్యలు ఎదుర్కొందురు. మాట మాట పట్టింపులతో కుటుంబములో కలతలు కలుగును. రాజీ యత్నమలు ఫలించవు. మధ్యవర్తుల, దళారుల మాటలు నమ్మి మోసపోవుదురు. ప్రభుత్వ పరమైన అనుమతులు నిలచిపోవును. బ్యాంకు లావాదేవీల యందు ఆర్ధిక మోసములు కలుగను. చోరభయము, అగ్నిభయము, విష కీటక భయము కలుగును. స్థిరచరాస్తులు కరిగిపోవును.
2026-2027 మేష రాశికి సంవత్సర తృతీయ భాగమున అనుకూల పరిస్థితులు గోచరించును. అన్నింటా అభివృద్ధి కరముగా నుండును. ఉద్యోగ వ్యాపారాదులయందు అనుకూలతలు గోచరించును. సంఘ గౌరవము పెరుగును. పోగోట్టుకున్న కొన్ని వస్తువులు తిరిగి వచ్చును. అప్రయత్న లాభము కలిగి ధనవృద్ధి కలుగును. మనస్సంతోషముతో నుందురు. మధుర పదార్ధములతో మృష్టాన్న భోజనము చేయుదురు. బంధు సౌఖ్యము కలుగును. నూతన ప్రయత్నములు ఫలించును. భార్య/భర్త/ సంతానముల మధ్య సయోధ్య కుదిరి ఆనందముగా నుందురు. దేహారోగ్యము కుదుట పడును. భూ, గృహ నిర్మాణాది కార్యక్రమములు తిరిగి ప్రారంభించెదరు. అనుకున్న పనులు పూర్తి చేయుటలో మిత్రుల సహకారము లభించును. ఆగిపోయిన అనుమతులు సకాలములో వచ్చును. శత్రుపీడ తగ్గును. ఋణబాధ తగ్గును. నూతన వస్తు సముదాయము సమకూర్చుకుందురు. నూతన గృహనిర్మాణాది కార్యములు అనుకూలించును. సత్వర అనుమతులు లభించును. ఆర్ధిక వనరులు అందుబాటులోకి వచ్చును. పోలీసు, కోర్టు కేసులు వాయిదా పడుటచే ఊపిరి పీల్చుకుందురు. వివాదములు శాంతించును.
2026-2027 మేష రాశికి సంవత్సరాంతమున శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుండగలదు. చేయు వృత్తి వ్యాపార, ఉద్యోగాదుల యందు కొన్ని చిక్కులు కలుగును. ఇంటి యందు సమస్యలు పెరుగుటచే మనశ్శాంతి లోపించును. పై అధికారుల వలన మాటలు పడక తప్పదు. తక్కువ వారితో వాగ్వివాదములు కలిగి అపజయముల నెదుర్కొందురు. ఆరోగ్య సమస్యలు పెరుగును. హఠాత్తుగా రాబడి తగ్గి అనుకున్న పనులు అతలాకుతలమగును. మర్యాద లోపించును. రాజకీయ పదవీత్యాగం చేయవలసి వచ్చును. అజీర్ణవ్యాధితో బాధపడుదురు. వ్యవసాయ నష్టములు కలుగును. స్థిరచరాస్తులు అమ్మి ఋణములు తీర్చవలసి వచ్చును. స్త్రీ మూలక సమస్యలు కలుగును. పోలీసు కొర్టుకేసులయందు బంధనము ఎదుర్కొనవలసి వచ్చును. ప్రయాణ విఘ్నములు కలుగును. వాహనములు మొరాయించును.
విద్యార్దులకు అనుకూల కాలము కాదు. పరీక్షలయందు అపజయమునెదుర్కొందురు. రెండు ఛాన్సుల యందు నిరాశ ఎదురగును. అనారోగ్య సమస్యలతో విద్యకు ఆటంకము కలుగును. జ్ఞాపకశక్తి తగ్గును. ర్యాంకులు పోగొట్టుకొందురు.
నిరుద్యోగులకు నిరాశ కలుగును. ఉద్యో గ ప్రయత్నముల యందు అపజయము కలుగును. నమ్మినవారి వలన మోసపోవుదురు. మరికొంత కాలము ఎదరుచూడక తప్పదు. చిన్న ఉద్యోగములతో సరిపెట్టుకొనక తప్పదు.
ఉద్యోగులకు అనుకూల కాలము కాదు. పై అధికారుల వలన మాటలు పడక తప్పదు. శారీరక మానసిక ఒత్తిడి పెరుగును. ప్రమోషన్లు నిలచి పోవును. ఎసిబి, ఐటి దాడులకు గురి అగుదురు. సస్పెన్షన్లు, డిమోషన్లకు గురి కాక తప్పదు.
వ్యాపారులకు అత్యంత నిరాశాజనక కాలము. కొన్ని వ్యాపారములు మూత పడును. నూతన ప్రయత్నములు నిలచిపోవును. ఆర్ధిక అసమానతలతో ఋణభారము పెరుగును. వ్యాపారప్రదేశముల యందు మార్పులు కలుగును.
కార్మికులకు కఠినమైన శ్రమకాలము, చేసిన పనికి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించదు. అసంతృప్తితో కాలము గడిపెదరు. మర్యాదకు హని కలుగును.
వ్యవసాయదారులకు కాలము కలిసిరాదు. ప్రకృతి వైపరీత్యములతో నష్టములు నెదుర్కొందురు. నూతన ప్రయత్నములు ఫలించవు. ప్రభుత్వ సహాయము సమయానికి లభించక ఆర్ధిక ఒత్తడికి గురి అయ్యేదరు.
ఆక్వా కల్చర్ వారు నష్టముల బాట పట్టవలసి వచ్చును. చేసిన ఋణములు తీర్చలేక సతమతమగుదురు. స్థిరాస్తులు అమ్ముకొనక తప్పదు. ఎగుమతి దార్లకు నిరాశ మిగులును.
కవులు, కళాకారులకు సంఘ గౌరవము తగ్గును. కార్యక్రమములు హఠాత్తుగా వాయిదా పడును. అవమానములు ఎదుర్కొందురు. సామాజికముగా గుర్తింపు తగ్గుటచే అసహనమునకు గురి అయ్యెదరు.
సినిమారంగము వారికి నిరాశ తప్పదు. చేసిన ప్రాజెక్టులు ఆగిపోవును. ఋణ బాధ పెరుగును. నూతన ప్రయత్నములు ఫలించవు.
రాజకీయ నాయకులకు వ్యతిరేక ఫలితములు నెదుర్కొందురు. పదవులు పోవును. ప్రజలు, ప్రభుత్వములో అవిశ్వాసము నెదుర్కొందురు. అపఖ్యాతి పాలగుదురు. పోలీసు కోర్టు కేసులతో సతమతమగుదురు.
NRIలకు పూర్తి వ్యతిరేక కాలము. విదేశీ ఉద్యోగములు పోగొట్టుకొని స్వదేశమునకు రాక తప్పదు. విదేశీ ప్రయాణములు వాయిదా పడును. స్పెక్యులేషన్ లాభించదు.
ఈ సంవత్సరమంతయూ రవి, గురు, శని, రాహు, కేతు గ్రహ శాంతి ఆచరించవలెను. నవగ్రహ పూజాక్రమము పరిశీలించండి.
1, 2, 3, 4, 7 మిత్ర సంఖ్యలు.
9, 18, 27 తేదీలు.
మంగళ, ఆది, సోమ, గురువారములు మంచివి.
అశ్వని వారు వైఢూర్యము, భరణి వారు వజ్రము, కృత్తిక వారు కెంపు ధరించవలయును.
షణ్ముఖి, పంచదశముఖి, గౌరీశంకర రుద్రాక్షలు ధరించవలయును.
Get the high-resolution PDF - Mesha 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.
ముఖ్య సూచన: ఈ మేష రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.