Mithuna Rasi 2026-2027 Telugu Rasi Phalalu Yearly Horoscope

Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Mithuna Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.

మిధునరాశి 2026-2027 Rasi Phalalu Banner
మృగశిర (3,4), ఆరుద్ర (4), పునర్వసు (1,2,3) పాదాలు.
💰 ఆదాయం: 8, 💸 వ్యయం: 11, 👑 రాజ్యపూజ్యం: 1,🚫 అవమానం: 7

శ్రీ పరాభవ నామ సంవత్సరం నందు మిధునరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుండగలదు. మతిమరుపు వలన అవసరమునకు తగిన విషయములు గుర్తుకురాకపోవుట మనశ్చాంచల్యం అనారోగ్యపీడ కార్య నాశనము కలుగును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదులయందు అనుకూలత లేకపోవుట పై వారితో మాటలు పడుట శ్రమకు తగిన గుర్తింపు లేకపోవుట కలుగును. ఉద్యోగాది ప్రయత్నముల యందు సాఫల్యత లేకపోవుట తరచు ఉద్యోగములు మారుట వ్యాపార స్థలము యందు సమస్యలు ఉద్యోగులు ఎదురు తిరుగుట, సహకరించపోవుట జరుగును. కొన్ని వాణిజ్య సంస్థలు పరిశ్రమలు మూత పడును. వృత్తియందు సంతృప్తి లేకపోవుట ప్రభుత్వము నుండి అధికారుల నుండి నోటీసులు అందుకొనుట జరుగును. సర్వకార్యముల యందు వ్యతిరేకత కలుగును. ఆరోగ్యము మందగించును. తరచు వైద్యశాలా దర్శనము, ఔషద సేవనం చేయవలసి వచ్చును. మధ్యమధ్య కొంత అనుకూల ఫలితములు కలుగును. తగిన ప్రయత్నం మీదట కార్యసిద్ధి కలుగును. అవసరమునకు తగిన ధనాదాయము చేకూరును. వ్యయప్రయాసలకు ఓర్చుకొని ధనము సంపాదింతురు. మిత్ర లాభము కలుగును. జ్వర పీడ శారీరక శ్రమ అలసిపోవుట కలుగును. గురు దేవతా దర్శనములు చేయుదురు. దానధర్మముల పట్ల ఆసక్తి చూపెదరు. యజ్ఞయాగాదుల యందు పాల్గోందురు. సాముదాయకముగా మిశ్రమ ఫలితములు కలగును. మర్యాద తగ్గును. శతృపీడ పెరుగును. అవసరమునకు తగిన ఆసరా లేకున్ననూ ప్రయత్నమీద ఆర్ధికముగా నిలద్రోక్కుకొందురు.

2026-2027 మిధునరాశికి సంవత్సర ప్రధమ భాగమున సర్వులతో కలహ వాతావరణము కలగును. ధనాదాయము తగ్గి ఋణ బాధలు పెరురును. అవసరమునకు తగిన ఆదాయము సమకూరకపోవుటచే మనోధైర్యము తగ్గి విచారమునకు లోనగుదురు. మాట నిలబెట్టుకొనుట కష్టమగును. వృధా సంచారము, త్రిప్ప్పుట కలుగును. మర్యాదకు హని కలుగును. చేయు వృత్తి వ్యాపార ఉద్యో గాదుల యందు హఠాత్తుగా మార్పులు జరిగి స్థానభ్రంశము కలుగును. వ్యాపార ప్రాంతముల యందు సమస్యలు కలుగును. ఆర్ధిక మోసములకు గురి అయ్యేదరు. బ్యాంకుల లావాదేవీల యందు ఆటంకములు కలుగును. సాంకేతిక సమస్యలతో ఆర్ధిక కష్టములు కలుగును. షూరిటీల విషయంలో సమస్యలు కొనితెచ్చుకున్న వారగుదురు. బంధుమిత్రాదులు సమయమునకు ముఖం చాటు వెసెదరు. దురాశ వలన చిక్కులు కలుగును. ఆర్ధికముగా వెనుకబడి పోవుదురు. మర్యాదకు హాని కలుగును. సోదర, సోదరీలతో మాట పట్టింపులు కలుగును. పితృస్వామ్య స్థిర చరాస్తుల విషయంలో అసంతృప్తికి లోనగుదురు. శత్రుబాధ కలగును. ఇంటి సమస్యలు న్యాయస్థానముల వరకు వెళ్ళును. స్త్రీ మూలక సమస్యలు పెరుగును. ప్రయాణ విఘ్నములు తరచూ జరుగుచుండును. వాహన ప్రమాదములు, వాహనములు మోరాయించుట జరుగును. సర్వకార్యములయందు వ్యతిరేకత వ్యక్తమగును. భార్య/భర్త సంతానముల మధ్య సఖ్యత లోపించును.

2026-2027 మిధునరాశికి సంవత్సర ద్వితీయ భాగమున కొంత పురోగతి లభించును. ఆర్ధికముగా లాభపడెదరు. ఋణ బాధలు తగ్గును. నూతన కార్యక్రమములు చేపట్టెదరు. హృదయ సుఖము కలుగును. కీర్తి గౌరవము లభించును. మూత పడిన సంస్థలు తిరిగి ప్రారంభమగును. ఆరోగ్యము కలుగును. మనశ్శాంతి లభించును. ఇంటి యందు సమస్యలు తొలగును. పశు, క్షేత్ర వృద్ధి కలుగును. స్థిరాస్తులు సమకూర్చుకొందురు. శతృపీడ తొలగును. పోలీసు, కోర్టు కేసుల యందు రాజీ ధోరణితో వ్యవహరించుటచే అనుకున్న కార్యములు చక్కబెట్టుకుందురు. శారీరక బలము పెరుగును. ధర్మ కార్య నిర్వహణయందు ఆసక్తి కలుగును. భార్య/భర్త సంతానముల మధ్య అభిప్రాయ బేధములు తొలగి అందరూ కలసి మెలసి ఉందురు. కుటుంబ సమస్యలు కొలిక్కి వచ్చును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు ఉప శమన వాతావరణము కలుగును. మిత్రుల సహకారముతో ఋణ విముక్తులగదురు.

2026-2027 మిధునరాశికి సంవత్సర తృతీయ భాగమున మిశ్రమ ఫలితములతో చికాకులు కలుగును. సోదర సోదరీలతో స్థిరాస్తి విషయములో కలహములు కలుగును. బంధు విరోధము కలగును. ఆర్ధిక నియంత్రణ లేకుండుటచే అతి వ్యయము కలిగి ఆదాయము తగ్గును. మనో నిబ్బరత తగ్గి ఆరోగ్యము మందగించును. సమయమునకు తగిన అవకాశములు రాకపోవుటచే ఇబ్బంది పడెదరు. శత్రుబాధ పెరుగును. భయము ఆవహించుటచే ఏ పని చేయుటకు ఉత్సాహము లేకుండును. భృత్యులతో కలహము కలుగును. మధ్య మధ్య కొంత శాంతి కలుగును. మిత్ర సహకారంతో ఉపశమన వాతావరణం కలుగును. శతృవులతో రాజీ ధోరణితో సమస్యలు చక్కబెట్టుకొందురు. మనోభీష్టములు నెరవేర్చుకొనుటలో కృతకృత్యులగుదురు. అధికారులతో ఇబ్బందులు తొలగి ధైర్యముతో ముందుకు సాగదురు.

2026-2027 మిధునరాశికి సంవత్సరాంతమున తిరిగి అన్ని విధములా పుంజుకొని సర్వ కార్యముల యందు విజయము పొందగలరు. హృదయ సుఖము కలుగును. సంఘ గౌరవము పెరుగును. ధనాదాయము పెరుగుటచే సమస్యలనుండి బయట పడగలరు. ధానధర్మములు విరివిగా చేయుదురు. పుణ్యక్షేత్ర సందర్శనము గురు దేవతా దర్శనము చేయుదురు. మనోభీష్టము లు అన్నియూ నెరవేరును. ఆరోగ్యము సహకరించును. వృత్తి,ఉద్యోగ వ్యాపారాదుల యందు ఉపశమనము కలుగును. ఋణ విముక్తులు కాగలరు. పోలీసు కోర్టు కేసుల యందు అనుకూల నిర్ణయములు రాగలవు. నూతన వ్యాపార వాణిజ్యములు కొంత వరకు అభివృద్ధి పధంలో నడుచును. భూగృహ నిర్మాణాది కార్యములు నెరవేరును. పశుక్షేత్ర వృద్ధి కలుగును. శారీరక బలము పెరుగును. ప్రయాణములలో అప్రమత్తతతో మెలగవలెను. వాహన ప్రమాదములు జరుగు సూచలున్నవి. విష, జంతు కీటక ప్రమాదములు ఎదుర్కొనవలసి వచ్చును. అజీర్ణము అలసట కలుగును.

విద్యార్దులకు అనుకూల కాలము కాదు. మందమతి, మందగమనము కలుగును. శ్రద్ద తగ్గును. అతినిద్ర, అతి ఆకలితో సతమతమగుదురు. అత్తెసరు మార్కులతో బయట పడెదరు. ర్యాంకులు పొగొట్టు కొందురు. ఆరోగ్యము క్షీణించును. మతిమరుపు కలుగును.

నిరుద్యోగులకు అత్యంత గడ్డు కాలము. మరికొంతకాలము వేచి చూడక తప్పదు. వచ్చిన ఉద్యోగములు సైతము తృటిలో తప్పిపోవును. సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడెదరు. ఆర్ధిక కష్టములు ఎదుర్కొనవలసి వచ్చును.తాత్కాలిక ఉద్యోగము చేయక తప్పదు.

ఉద్యోగులకు పై అధికారుల వలన సమస్యలు ఏర్పడును. రూల్స్‌కి విరుద్ధముగా పనిచేయ వలసిన పరిస్థితి వచ్చును. ఉద్యోగ భద్రత లేకుండును. అవాంఛనీయ బదిలీలు, సస్పెన్షన్లకు గురి అగుదురు. ప్రమోషన్లు నిలచిపోవును. ఎ.సి.బి/సి.బి.ఐ/ఐటి దాడులు గురి అగుదురు.

వ్యాపారులకు అనుకూల కాలము కాదు. వ్యాపార వాణిజ్యములు నష్టముల బాట పట్టును. సంస్థýలో పనిచేయు ఉద్యోగులతో సఖ్యత తగ్గును. భాగస్వాముల మధ్య అభిప్రాయ బేధములు కలుగును. వ్యాపార విస్తరణకు అడ్డంకులు ఏర్పడును. అనుమతుల నిలచిపోవును.

కార్మికులకు శ్రమ పెరుగును గుర్తింపు తగ్గును. చేసిన పనికి తగిన వేతనము లభించక ఇబ్బంది పడెదరు.

వ్యావసాయదారులకు పూర్తి వ్యతిరేకకాలము పంటలు చీడ పీడల లోనగును. ప్రకృతి వైపరీత్యములకు గురి అయ్యెదరు.

ఆక్వాకల్చర్ వారికి అత్యంత గడ్డుకాలము ఆర్ధిక నష్టములు కలుగును దైర్యము తగ్గును.

కవులు, కళాకారులు సంఘ గౌరవము తగ్గును. మర్యాదహాని కలుగును. అవమానము ఎదుర్కోనక తప్పదు.

సినిమారంగం వారికి తిరోగమనము కలుగును. ప్రాజెక్టులు ఆగి పోవును. కొత్త ప్రాజెక్టులకు విఘాతము కలుగును. గుర్తింపు తగ్గిపోయి ప్లాపులతో ఆర్ధిక నష్టములతో, కష్టములను ఎదుర్కొనవచ్చును.

రాజకీయనాయకులకు మర్యాదకు హాని కలుగును. ప్రజా వ్యతిరేకత కలుగును. పరుల చెప్పిన మాటలు విని, చేసిన పనుల వలన అపకీర్తి పాలగుదురు. పదవీచ్యుతికి లోనగుదురు. కేసుల వలన కొంత నిరాశ పడుదురు.

NRIలకు ఉద్యోగభంములు ఉండును భరతదేశముకు రిక్తహస్తములతో వెనుతిరిగెదరు. ఋణ బాధలు పెరుగును. స్పెక్యులేషన్ లాభించదు.

2026-2027 మిధునరాశి: గ్రహశాంతి, అదృష్టసంఖ్య, అదృష్ట రత్నం & రుద్రాక్షధారణం

🙏 గ్రహశాంతి

ఈ సంవత్సరమంతయు కుజ, రవి, రాహు, శని, గురు, కేతు గ్రహశాంతి ఆచరించవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.

🔢 అదృష్టసంఖ్య
5

5,14,23 తేదీలు బుధవారములతో కలసివచ్చిన యోగం. 1,3,4,6,8,9, ఆది, మంగళ, గురు, శుక్రవారములు శుభం.

💎 అదృష్ట రత్నం

మృగశిర వారు పగడం, ఆరుద్రవారు గోమేధికం, పునర్వసు వారు కనకపుష్యరాగం ధరించవలెను.

📿 రుద్రాక్షధారణం

చతుర్ముఖి, త్రయోదశముఖి, నవదశముఖి (4, 13, 19).

Mithuna Rasi Phalalu 2026-2027 PDF Download

Get the high-resolution PDF - Mithuna 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.


Rasi Phalalu 2026-2027 Copyrights: “BrahmaSri Pedagadi Mohana Ravishankar Daivagna”, Mobile: 9949598627. Read Disclaimer

ముఖ్య సూచన: ఈ మిథున రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.

» Telugu Festivals 2026 (IST)