Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Simha Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.
శ్రీ పరాభవ నామ సంవత్సరము నందు సింహరాశి వారి ఈ గ్రహ స్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములతో నుండగలదు. అన్ని విధములా ధనలాభము కలుగును. అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభము కలుగును. మనోవాంఛలు నెరవేరును. శరీర ఆరోగ్యము అనుకూలముగా నుండును. సర్వదా ఉత్సాహ ముగా నుందురు. ఋణబాధలు తగ్గును.శతృపీడ తొలగును. చేయు వృత్తి వ్యాపార ఉద్యో గాదుల యందు అభివృద్ధి కలుగును. ధైర్యముతో ముందుకు సాగగలదు. శరీరమున వ్రణములు శరీర కాంతి తగ్గుట వంటి సమస్యలనెదుర్కొందురు. ధనాదాయము అనుకూలముగా ఉం డుటచే ఔషద సేవనముతో ఉత్సాహముగా నుందురు. అకారణమగా ధనవ్యయము కలుగును. నూతన వస్తు వాహన సముదాయము చేకూరును. పుణ్యక్షేత్ర సందర్శనములు దైవదర్శనములు చేయుదురు. ఇంటా బయట కష్టమునెదుర్కొందురు. మధ్య మధ్య అశాంతి కలుగును. అకారణముగా కార్యములు ఆగిపోవును. మనోధైర్యము తగ్గును. సంఘ గౌరవము తగ్గి మర్యాద మన్ననలు పొందలేక అవమానములు నెదర్కొనవలసి వచ్చును. భూగృహ నిర్మాణాది కార్యములు అత్యధిక ధనవ్యయము చేసిన మీదట పూర్తి అగును. అసంతృప్తితో నుందురు. హంగు ఆర్బాటములకు ధనవ్యయము చేయుదరు. పశు నష్టము, క్షేత్ర నష్టములు కలుగును. స్థాన చలనము కలుగును. అధికారుతో మాట పట్టింపులు కలుగును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు విరోధములు కలహములు కలుగును. పోలీసు కోర్టు కేసులలో ప్రతి కూలత ఎదుర్కొందురు. స్థిరమైన బుద్ధి లేక సంచరించెదరు.
2026-2027 సింహరాశికి సంవత్సర ప్రారంభమున అన్ని విధముగా లాభ పడెదరు. మనోవాంఛలు నెరవేరును. సంఘ గౌరవము పెరుగును. శుభకార్య నిర్వహణ చేయుదురు. అనుకున్న పనులన్నియూ సత్వరము పూర్తి చేయగలరు. బంధు మిత్రాదుల సహకారము లభించును. కీర్తి వృద్ధి కలుగును. శరీర బలము తేజస్సు కలిగి ఉత్సాహముగా నుందురు. ఆరోగ్యము పూర్తిగా సహకరించును. ఇంటియందు సంతాన వృద్ధి కలుగును. గో, భూ లాభము పశు వృద్ధి క్షేత్ర వృద్ధి కలుగును. గురుదేవతా సందర్శనము చేయగలరు. మంత్ర సిద్ధి కలుగును. శత్రువులు నశించెదరు. సువర్ణ రజిత వస్తు సంచయం సమకూరును. నూతన వస్తు వాహన వస్త్రాదులు అప్రయత్నముగా సమకూరును భార్య/భర్త సంతానముల మధ్య అవగాహనతో కుటుంబ జీవనము సంతోషముగా నుండును. శక్తికి మించిన కార్యములు చేసి విజయము సాధించగలరు. నూతన విద్య ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. కృషి వాణిజ్య వ్యాపారాదుల యందు లాభార్జన చేయగలరు. స్త్రీ దేవతారాధన ఆసక్తి కలుగును. దానధర్మములు చేయుదరు.
2026-2027 సింహరాశికి సంవత్సర ద్వితీయ భాగమున అపరితమైన ధన వ్యయము చేయుదురు. అనవసర ఖర్చులు దుబారా ఖర్చులు పెరుగును. సంబందము లేని విషయములలో తలదూర్చుటచే ధన వ్యయము కలుగును. హఠాత్పరిణాములలో సమస్యలు కలుగును. వ్యయ భారము కలుగను. సమయమునకు తగిన ఆదాయ వనరులు అందుబాటులో లేక స్థిర చరాస్తులు కరిగిపోవును. శత్రుభయము కలుగును. శత్రువులు పుంజుకొని సమస్యలు సృష్టించెదరు. వృధా సంచారము కలుగును. భార్య/భర్త సంతానముల మధ్య సఖ్యత లేకుండుటచే మనశ్శాంతి లోపించును. ఆస్తి పంపకముల విషయములలో దాయాదులతో సమస్యలు ఏర్పడును. శరీర ఆరోగ్యము సహకరించక పోవుటచే వైద్యశాలా దర్శనం ఔషద సేవనం తప్పని సరి అగును. స్థాన చలనము కలుగును. గో పశు సంపద క్షీణించును. ప్రభుత్వ అధికారుల నిర్ణయముల వలన వ్యతిరేక ఫలితములు వచ్చును. ప్రభుత్వ అనుమతులు నిలిచిపోవును. కుటుంబంలో కలహములు కలుగును. ఆదాయ మార్గములు తగ్గిపోవుటచే నష్టముల బాట పట్టెదరు. మనోదైర్యము తగ్గి వృధా సంచారము చేయుదురు. బంధు ద్వేషము కలుగును.
2026-2027 సింహరాశికి సంవత్సర తృతీయ భాగము నందు అధిక ధనవ్యయము కలుగును. ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదములు చోటు చేసుకొని అత్యవసరంగా ఋణములు చేయవలసి వచ్చును. మతి భ్రమణం కలుగును. శరీర, మనో అశాంతి కలుగును. సర్వకార్య విలంబము కలుగటచే మనస్సు కకావికలం అగును. శత్రువులు విజృభించెదరు. మిత్రుల సైతము శత్రువుల వలె బాదించెదరు. శక్తి క్షీణించును. ఆరోగ్యము మందగించును. వస్తు, వాహన నష్టములు వాహన ప్రమాదములు కలుగును. శరీరముపై గాయములు కలుగుటచే భయము కలుగును. స్థిర చరాస్తులు కరిగి పోవును. బంధువుల వలన మాటలు పడుదురు. స్థిరత్వము తగ్గి భయము కలుగుటచే అకారణముగా ఇంటి నుండి వెడలి పోవుట జరుగును. అభివృద్ధి నిలచిపోవును. పోలీసు కోర్టు కేసులలో ప్రతికూలతలు ఏర్పడును. జరిమానాలు చెల్లించవలసి వచ్చును.
2026-2027 సింహరాశికి సంవత్సరాంతమున కొంత పురోగతి లభించగలదు. ధైర్యముతో కార్యములు నిర్వర్తించ గలరు. శత్రుభయము ఋణ భయము తగ్గును. శరీర ఆరోగ్యము కుదుట పడును. ఔషద సేవనముతో ఉపశనము కలుగును. బుద్ధి పరాక్రమము వికసించును. ధైర్యముగా ముందుకు సాగగలరు. రాజీ ధోరణీతో కొన్నికార్యములు చక్కబెట్టుకొందురు. మనస్సు ఉల్లాసంగా ఉం డును. భార్య/భర్త సంతానముల మధ్య సమస్యలు తొలగి ఆనంద జీవనము గడిపెదరు. భూ లాభము క్షేత్ర లాభము పశు లాభము కలుగును. ధనాదాయమ బాగుండును. కాని ధన వ్యయము మాత్రము అపరిమితముగా నుండగలదు. కొన్ని స్థిర చరాస్తులు పొగొట్టుకొందురు. మిత్రుల సహకారంతో కార్యసాఫల్యత కలుగును. కీర్తి కాంక్షతో ధనవ్యయము చేయుదురు. బ్యాంకులు, ఆర్ధిక లావాదేవీల యందు మోసములకు గురి అగు సూచనలున్నవి. తరచూ పుణ్యక్షేత్ర సందర్శనము చేసేదరు. గురు పండిత దైవ దర్శనములు చేయుదురు. శక్తి మించిన పనులు పూర్తి చేయుటలో బంధు మిత్రుల సహకారము లభించగలదు. నేత్ర బాధ కంటి ఆపరేషన్లు జరుగు సూచనలున్నవి.
విద్యార్దులకు శుభా శుభ మిశ్రమ కాలము మార్కులు సాధించుటలో విఫలమగుదురు. ర్యాంకులు అవార్డులు తృటిలో తప్పిపోవును. మతిమరుపు పెరుగును. శారీరక మానసిక ఒత్తిడికి గురి అయ్యేదరు.
నిరుద్యోగులకు నిరాశాజనక కాలము వృధా సంచారము అనవసరముగా త్రిప్పుట జరుగును. చేసిన ప్రయత్నములు చివరిలో నిరర్ధకమగును. ఆర్ధిక మోసములకు గురి అయ్యెదరు.
ఉద్యోగులకు మానసిక ఆందోళన కలుగును. తరచూ బదిలీలు దూర ప్రాంత వాసములతో ఇబ్బంది పడుదురు. పై అధికారులను మెప్పించలేక సతమతమగుదురు. నీరసం నిస్పత్తువ ఆవహించును.
వ్యాపారులకు మిశ్రమ కాలము లాభ నష్టములతో మిశ్రమ స్పందన కలుగును. తగు మాత్రముగా వ్యాపారము చేయుట మంచిది. వృధా సంచారముతో కాలయాపన జరుగును. కొన్ని వ్యాపారములు స్థాన భ్రంశము కలుగును. దూరపు కొండలు నునుపు వలె సంచరించి మోసపోవుదురు.
కార్మికులకు అత్యంత కష్టకాలము చేసిన పనికి తగిన గుర్తింపు లేకుండును. శక్తి క్షీణించును. ఆరోగ్యము సహకరించదు. వృత్తి రీత్యా దూరప్రాంతములకు వెళ్ళవలసి వచ్చును.
వ్యవసాయదారులకు అనుకూల కాలము కాదు. పశు క్షేత్ర నాశనము కలుగును. చోరభయము కలుగును. పంటకు తగిన గిరాకి గిట్టుబాటు ధరలు లేక సతమతమగుదురు. చీడ పీడల భయము కలుగును. ఆరోగ్యము మందగించును.
ఆక్వాకల్చర్ వారికి ఆర్ధిక లాభములు సామాన్యముగా నుండును. తగిన ప్రతిఫలము పొందలేరు. కష్టములు మిగులును. భాగస్వాముల మధ్య విభేదములు వచ్చును.
కవులు, కళాకారులు అవకాశములు రాక ఇబ్బంది పడుదురు. సంఘ గౌరవము తగ్గును. ప్రతిఫలములు తగు మాత్రముగా నుండును. నీరసం నిస్పత్తువ కలుగును.
సినిమారంగము వారికి ఏడారిలో ఓయసిస్సు వలె ఉండును. అవకాశములు చేజారి ఋణ భారము పెరిగి పోవును. ప్రజాదరణ తగ్గును.
రాజకీయ నాయకులకు నూతన పదవులు ఊరించి ఉసూరుమనిపించును. ఆదాయము తగ్గును. ప్రజా ప్రభుత్వ మద్ధతు లభించదు. ప్రజా సంబదములు మందకొడి సాగును.
NRIలకు పూర్తిగా వ్యతిరేక కాలము వట్టి చేతులతో స్వదేశమునకు తిరిగి వచ్చెదరు. ఋణములతో కాలము గడిపెదరు. స్పెక్యులేషన్ లాభించదు.
ఈ సంవత్సరమంతయూ గురు, శని, రాహు, కేతు గ్రహశాంతి ఆచరించవలెను.
2, 3, 4, 7, 9 మిత్ర సంఖ్యలు ఆది, సోమ,గురు, మంగళ వారములు కలిసిన శుభము.
మఘ-వైఢూర్యము, పుబ్బ-వజ్రము, ఉత్తర-కెంపు ధరించవలెను.
ఏకముఖి, దశముఖి, త్రిజుటి ధరించవలెను.
Get the high-resolution PDF - Simha 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.
ముఖ్య సూచన: ఈ సింహ రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.