Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Tula Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.
శ్రీ పరాభవ నామ సంవత్సరము నందు తులరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయూ శుభాధిక మిశ్రమ ఫలితములతో ఆనందముగా నుందురు. ధనలాభమునకు లోటు లేదు. అప్రయత్న కార్యసిద్ధి ధనలాభము కలుగును. సంఘ గౌరవము పెరుగును. నూతన రాజకీయ పదవీ యోగము అప్రయత్నముగా లభించును. ఆధిపత్య ధోరణితో అన్నింటియందు ముందంజలో ఉందురు. సుఖజీవనము సాగింతురు. సకల కార్యసిద్ధి కలుగును. శత్రునాశనము కలుగును. శత్రువులు మీ ఒత్తిడి తట్టుకొనలేక శరణాగతి కోరి అణిగి మణిగి ఉందురు. ఋణబాధలు నశించును. పాత ఋణములు తీర్చివేయుదురు. ఆరోగ్యము పూర్తిగా సహకరించును. శారీరక మానసిక ఆనందముతో కాలము గడిపెదరు. నూతన వస్తు వాహనములు బంగారు రజితాది విలువైన ఆభరణ సామాగ్రి సమకూ ర్చుకొందురు. భార్య/భర్త సంతానముల మధ్య చక్కని అవగాహనతో ఆనందముగా నుందురు. బంధుమిత్రాదులు సహకరించెదరు. చేయు వృత్తి వ్యాపార కృషి వాణిజ్య ఉద్యో గాదుల యందు అపరిమిత ధన సంపాదన కలుగును. పశువృద్ధి క్షేత్రవృద్ధి గో లాభము కలుగును. గురు పండిత దైవ దర్శనములు చేయుదురు. అన్నదాన ఫలము కలుగును. నూతన దేవాలయ తాటాకాది నిర్మాణ ఫలప్రాప్తి కలుగును. మధ్యమధ్య కొంత ఆరోగ్య లోపములు కలిగిననూ ఔషద సేవనముతో ఉపశమనము పొందగలరు. శుభకార్య నిర్వహణకు ధనము నీళ్ళవలె ఖర్చు చేసెదరు. బంధు విరోధము కలుగును. జంతు భయము దూరప్రాంత ప్రయాణ విఘ్నములు కలుగును. అయిననూ వెరవక కార్య నిర్వహణ చేయుదురు.
2026-2027 తులరాశికి సంవత్సర ప్రారంభమున సకల కార్యసిద్ధి కలుగును. అప్రయత్నముగా తలచిన కార్యములు చక్కబెట్టుకొందురు. మనోధైర్యము ఎక్కువగా నుండును. శారీరక సౌఖ్యము కలుగును. సకల కార్యసిద్ధి కలుగును. బంధు సమకారముతో నూతన ప్రయత్నములు అనుకూలించును. ఇంటాబయట శత్రునివారణ కలుగును. సర్వులకు పూజార్హుడుగా నుందురు. ప్రభుత్వ పదవులు చేపట్టెదరు. చేయు వృత్తి కృషి వాణిజ్య ఉద్యోగాదుల యందు మీకు ఎదురు లేకుండును. నూతన రాజకీయ పదవులు అప్రయత్నముగా లభించును. భూ, గృహ నిర్మాణాది కార్యములు సత్వరము నెరవేరును. నూతన స్థిర చరాస్తులు సమకూర్చుకొందురు. సంతాన సౌఖ్యము కలుగును. పుత్ర సంతాన యోగము కలుగును. మంత్రసిద్ధి దేవతా దర్శనము పుణ్యక్షేత్ర సందర్శనము చేయుదురు. యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనుట అన్న, వస్త్ర దానాది ఫలము కలుగును. పోలీసు కోర్టు కేసులలో అనుకూల నిర్ణయములతో ఉత్సాహముగా నుందురు. ఆర్ధికముగా నిలదొక్కుకొందురు. పుష్ఫ, గంధ పరిమళ ద్రవ్య లాభము కలుగును. బంగారు ఆభరణ ప్రాప్తి కలుగును.
2026-2027 తులరాశికి సంవత్సర ద్వితీయ భాగమున అపరిమిత ధనవ్యయము కలుగును. వృధా ఖర్చులు పెరిగిపోవును. దూరదేశ సంచారము అనాలోచితముగా చేయుదురు. శత్రువుల కట్టడికి కొంత ధనము ఖర్చు అగును. బంధువులతో అభిప్రాయ భేదములు కలుగును. ఋణములు తీసుకున్న సొమ్ము సైతము వృధాగా ఖర్చు అగును. విలువైన వస్తు వాహన సామాగ్రి పోగొట్టు కొందురు. అనారోగ్య లోపములచే ఔషద సేవనము చేయుదరు. కృషి నష్టము కలుగును. శుభకార్యముల నిమిత్తము అధిక ధనవ్యయము చేయుదురు. బంధుమిత్రాదులకు ఇచ్చిన ధనము వెనుకకు రాకుండును. చీడపీడలచే వ్యవసాయ నష్టములు కలుగును. వృధా సంచారము చేయుదురు. హంగు ఆర్భాటముల కొరకు దేశ విదేశములు తిరుగుటతో ధనము నీళ్ళవలె ఖర్చు అగును. బంధు దూషణము కలుగును. ఇష్టమైన వ్యక్తుల తిరస్కారములను ఎదుర్కొనవలసి వచ్చును. నూతన కార్యక్రమములు చేపట్టుటలో నమ్మిన వారి వలన మోసములకు గురి అగుదురు. దాయదులతొ వాగ్వివాదములు కలుగును.
2026-2027 తులరాశికి సంవత్సర తృతీయ భాగమున రెట్టించిన ఉత్సాహముతో శక్తి పుంజుకొని ముందుకు సాగగలరు. చేసిన తప్పిదములను గమనించి సరిచేసుకొనకగలరు. అధిక ధనవ్యయుము నియంత్రణ చేసుకొందురు. ఋణబాధలు తప్పిపోవును. అప్రయత్న కార్యసిద్ధి ధనలాభము కలుగుటచే అనాయసముగా ధనము సంపాదింతురు. ఆరోగ్యము పూర్తిగా సహకరించును. శత్రువులు మిన్నకుందురు. నూతన భూ క్షేత్ర లాభము కలుగును. ఐశ్వర్యవృద్ధి కలుగును. భార్య/భర్త లమధ్య చక్కని అవగాహనతో సౌఖ్య జీవనము కలుగును. సంతాన వృద్ధి కలుగును. చేయ వృత్తి వ్యాపార కృషి వాణిజ్య ఉద్యోగాదుల యందు ఉన్నతి కలుగును. వ్యాపార విస్తరణకు నూతన ప్రణాళికలు అమలు చేసేదరు. క్షీరాన్నాది సుఖ భోజనప్రాప్తి కలుగును. నూతన వస్తు వస్త్ర భూషణాదులను సమకూర్చుకొందురు. సంఘ గౌరవము పెరుగును. నూతన పదవులు చేపట్టెదరు. సన్మాన సత్కారములు స్వీకరించెదరు. అపూర్వ దేవతా దర్శనము చేసేదరు. అన్నదాన విభవము కలుగును. సర్వులయందు గుర్తింపు కలిగి సుఖజీవనము సాగింతురు. సంగీత సాహిత్యాది కార్యక్రమములలో పాల్గొందురు.
2026-2027 తులరాశికి సంవత్సరాంతమున కొన్ని ఓడిదుడుకులు కలుగును. అనవసరముగా తిరుగుట వృధా సంచారము చేయుదరు. సంతాన మూలక సమస్యలు కలుగును. అకాల భోజనము కలుగును. సంఘము నందు తల వంచవలసి వచ్చును. ఆరోగ్యము సామాన్యముగా ఉండును. మనో విచారముచే ఔషద సేవనము చేయుదరు. బంధుమిత్రాదులతో కలహములు కలుగును. రాజకీయ పదవీ వ్యామోహముతో కొన్ని ఖర్చులు మీద పడును. భోజన సౌఖ్యము కలుగును. కర్మసిద్ధిని పొందగలరు. శరీర ధారుఢ్యము కలుగును. భార్య/భర్త సంతానముల మధ్య సఖ్యత కలుగును. శుభకార్య నిర్వహణ నభూతో నభవిష్యతి అన్నట్లుగా చేసి చేయు కాల్చుకొందురు. బంధు సంతోషము కొరకు ధనము వెచ్చించెదరు. పశు నష్టము కలుగును. స్థాన చలనము కలుగును. కొన్ని సమయముల యందు మాట నిలబెట్టుకొనుట కష్టమగును. శక్తిమేరకు కష్టించిన ఫలితము సామాన్యముగా నుండగలదు. ధనధాన్య నాశనము కృషి నష్టము సంభవించును. మర్యాద తగ్గును. పదవీ గండములుండును. నమ్మిన వారి వలన మోసములు ఎదురగును. అందరిలో చులకన అగుదురు. మత్తు పదార్ధములకు అలవాటు పడుదురు. స్థానచలనముతో దూర ప్రాంతములకు వెళ్ళవలసి వచ్చును.
విద్యార్దులకు అనుకూలకాలము పరీక్షలలో అనుకున్న విజయము సాధించెదరు. అవార్డు ర్యాంకులు పొందగలరు. ప్రముఖ విద్యాసంస్థలలో సీటు వచ్చును.
నిరుద్యోగులకు ఆశావహ కాలము కష్టమునకు తగిన ప్రతిఫలము దక్కును. ప్రయత్నములు ఫలించి మంచి సంస్థలలో ఉద్యోగము పొందగలరు.
ఉద్యోగులకు అనుకూల కాలము అనుకున్న స్థానములకు సులభముగా బదిలీలు జరుగును. ప్రమోషన్లు పొందురు.
వ్యాపారులకు ధనాదాయము కలుగును. నూతన ప్రయత్నములు ఫలించి కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించెదరు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు సత్వరమే లభించును.
కార్మికులకు గౌరవ మర్యాదలు కలుగును. శ్రమ తగ్గును. గుర్తింపు పొందెదరు చేసిన పనికి తగిన గుర్తింపు ప్రోత్సాహము లభించును. నూతన ప్రయత్నములు సాగగలవు.
వ్యవసాయదారులకు నూతన వస్తు వాహనములు సమకూర్చుకుందురు. సమాజములో గౌరవ మర్యాదలు పొందెదరు. పంటల విశేషముగా ఫలించును. క్షేత్రాభివృద్ధి కలుగును.
ఆక్వాకల్చర్ వారికి అపరిమితమైన ధన యోగము సిద్ధించును. అనుకూలం ధనయోగము కలుగును. అప్రయత్న ధనలాభముతో ఆనందముగా నుందురు.
కవులు, కళాకారులకు విశేషమైన గుర్తింపు లభించును. సంఘగౌరవము పెరుగును. సన్మాన సత్కారములు పొందగలరు. మీమాటకు ఎదురు లేకుండును. విశేషమైన ధనప్రాప్తి పొందగలరు.
సినిమారంగము వారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించెదరు. ఆదాయ మార్గములు అందుబాటులోకి వచ్చును. భాగస్వాముల మధ్య అనుకూలత కలుగును. మంచి కాలము.
రాజకీయ నాయకులకు గౌరవ ప్రతిష్టలు పెరుగును. నూతన పదవులు ఆయాచితముగా వచ్చి వరించును. కష్టమునకు గుర్తింపు లభించి హఠాత్తుగా పెద్దపదవులు పొందెదరు.
NRIలకు అనుకూల కాలము విదేశీ ప్రయణము ఫలించును అపూర్వమైన ప్యాకేజిలతో ఉత్సాహముగా నుందురు. అభివృద్ధిపదంలో నడిచెదరు. స్పెక్యులేషన్ లాభించును.
ఈ సంవత్సరము రవి, గురు, రాహు, కేతు, కుజ శాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి పరిశీలించండి.
5, 8 మిత్ర సంఖ్యలు.15, 24 తేదీలు శుక్ర, బుధ, శనివారములు కలిసిన మరింత యోగము.
చిత్త-పగడము, స్వాతి-గోమేధికం, విశాఖ-పుష్యరాగం ధరించవలెను.
పంచముఖి, చతుర్ధశముఖి, ఏకవింశతిముఖి రుద్రాక్షధారణ శుభము.
Get the high-resolution PDF - Tula 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.
ముఖ్య సూచన: ఈ తుల రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.