Vruschika Rasi 2026-2027 Telugu Rasi Phalalu Yearly Horoscope

Sri Parabhava Nama Samvatsara 2026 - 2027 Vruschika Rasi Horoscope (Ugadi 2026-27 Rasi Phalalu) Yearly Predictions in Telugu.

వృశ్చికరాశి 2026-2027 Rasi Phalalu Banner
విశాఖ (4), అనూరాధ (4), జ్యేష్ఠ (4) పాదాలు.
💰 ఆదాయం: 11, 💸 వ్యయం: 5, 👑 రాజ్యపూజ్యం: 2,🚫 అవమానం: 6

శ్రీ పరాభవ నామ సంవత్సరము నందు వృశ్చికరాశి వారి ఈ గ్రహ స్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభా శుభ మిశ్రమ ఫలితములతో నుండును. ఆరోగ్య లోపములతో ఆటంకములతో సతమతమగుదురు. రోగభయం అధికముగా నుండును. నిత్య కలహములతో అందరికి దూరముగా ఉందురు. మంచి మర్యాదలకు విలువ లేకుండును. ఔన్నత్యమును గుర్తించలేక మిమ్ము అవమానముల పాలు చేయుదురు. మర్యాద తగ్గును. అభిప్రాయ బేధములతో ఇంటా బయట కలహ వాతావరణం కలవరపరుచును. తరుచు వైద్యశాలా దర్శనం ఔషద సేవనం తప్పనిసరి అగును. భూ, గృహ నిర్మాణాది కార్యములకు ఆటంకములు కలుగును. ప్రభుత్వ అనుమతులు నిలచిపోవును. చేయు వృత్తి వ్యాపార వర్తక వాణిజ్య ఉద్యోగాదుల యందు సహచరులతో కలహములు పనివారితో జగడములు పై అధికారులతో ఇబ్బందులు కలుగును. ఎవరినీ మెప్పించలేక సతమతమగుదురు. భార్య/భర్తల మధ్య సఖ్యత తగ్గును. నిత్య కలహములతో నుందురు. సంతాన సౌఖ్యం తగ్గును. సంతాన మూలకముగా పెరుగును. శత్రువులతో సమస్యలు కలిగి మానసిక ఆందోళన పెరుగును. మధ్య మద్య కొంత శాంతి లభించును. ధనలాభము కలుగును. ఔషదసేవనముతో ఆరోగ్యలోపములు సవరించుకొందురు. ధనాదాయము పెరుగుటచే అభివృద్ధిలోనికి వచ్చెదరు. భూ, లాభము క్షేత్ర వృద్ధి కలుగును. అతికష్టము మీద శుభకార్యములు నిర్వహణ పూర్తి చేయుదురు. వృధా సంచారము కలుగుటచే ఖర్చులు పెరుగును. విద్యకు ఆటంకములు కలుగును. సోదర, సోదరీలతో సత్సంభదములు కలుగును. విభేదములు పరిష్కరించకొనగలరు. సకల కార్యముల యందు ఆటంకములతో చివరికి విజయము సాధించగలరు.

2026-2027 వృశ్చికరాశికి సంవత్సర ప్రారంభమున అనారోగ్య లోపములతో అలసిపోవుదురు. తరచూ వైద్యశాలా దర్శనము ఔషద సేవనం చేయుదురు. మనోవ్యధ పెరుగును. మానసిక ఆరోగ్యము ఇబ్బంది పెట్టును. సర్వకార్య ఆటంకములతో అవమానములతో సమస్యలకు లోనగుదురు. ఆదాయము క్షీణించును. దొంగల భయము కలుగును. విలువైన వస్తువులు తస్కరించబడును. మతిమరుపుతో కొన్ని వస్తువులు పొగొట్టుకొందురు. అగ్నిభయము కలుగును. విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ కలుగు అవకాశము ఉన్నది. ప్రభుత్వ అధికారుల నుండి సమస్యలు కలుగును. అనుమతులు రాకపోవుటచే కార్యక్రమములు వాయిదా పడును. శరీర ధారుఢ్యము తగ్గును. దేహము సొంపు చెడును. గాంభీర్యము తగ్గును. సర్వులతో కలహములతో తీవ్రమైన క్రూరోక్తులు వచించగలరు. తెగువ కోపము కలుగును. బంధుమిత్ర సహకారము తగ్గును. మిత్రభేదము కలిగును. దూరప్రాంతములకు బదిలీలపై వెళ్ళవలసి వచ్చును. అందరిని అనుమానించుచూ అపనమ్మకముతో నుందురు. పదవీ త్యాగం కలుగును.

2026-2027 వృశ్చికరాశికి సంవత్సర ద్వితీయ భాగమున అన్నివిధముల పుంజుకొని పునర్‌వైభవము పొందగలరు. ధనాదాయము పెరుగును. సర్వకార్య జయము పొందెదరు. ఆదాయ మార్గములు విస్తరించును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు ధనాదాయము పెరుగును. కులాచార కార్యక్రమములో పాల్గొందురు. భార్య భర్తల మధ్య విభేదములు సమసి సఖ్యత కలుగును. సామరస్య జీవనము కొనసాగించెదరు. ఆగిపోయిన పనులన్నియూ తిరిగి ప్రారంభించెదరు. మృష్టాన్నభోజన సౌఖ్యము కలుగును. సదా బంధుమిత్ర పరివారముతో ఆనందముగా నుందురు. సంతాన సమస్యలు తొలగిపోవును. అభివృద్ధి పధంలో నడిచెదరు. అప్రయత్న కార్యసిద్ధి ధనలాభము కలుగును. వ్యాపారాదులను విస్తరించెదరు. దూరప్రాంత సందర్శన చేసి నూతన ప్రణాళికలు అమలు చేసెదరు. గో పశు, భూ లాభముల కలుగును. పోలీసు కోర్టుకేసుల యందు అనుకూల ధోరణి వ్యక్తమగును. శారీరక మానసిక ధైర్యముతో ముందుకు సాగగలరు. మీ మాట శిరోధార్యముగా భావించి సర్వులు మీకు వత్తాసు పలుకు దురు. మంత్రసిద్ధి కలుగును. బుద్ధి బలము కలిగి తెలివైన నిర్ణయములు తీసుకొనగలరు.

2026-2027 వృశ్చికరాశికి సంవత్సర తృతీయ భాగమున అధిక ధనవ్యయము కలుగును. సంబందము లేని వ్యవహారములలో తలదూర్చి చేతులు కాల్చుకొందురు. వృధా సంచారము భయము కలుగును. బంధు దూషణ కలుగును. ఆప్తమిత్రులు దూరమయ్యెదరు. సకల కార్యములు వాయిదా పడును. సాంకేతిక సమస్యలతో ప్రభుత్వ అనుమతులు నిలచిపోవును. ఆర్ధిక వనరులు క్షీణించును. చేయు వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు భిన్నము కలుగును. వృత్తిలోపము కలుగును. దూరప్రాంత కృషి వాణిజ్యాదులలో నష్టములు కలుగును. శక్తిమేరకు కష్టించినా ఫలితము లేకుండును. అప్రయత్నముగా బదిలీలు కలుగును. అనూహ్యముగా ధనాదాయము తగ్గి సమస్యలు కలుగును. మిత్రుల సహకారము లోపించును. స్థిర చరాస్తులు కరిగిపోవును. దాయాదులతో కలహములు కలిగి వ్యాజ్యములు కోర్టు వరకు పోవును. హీన జాతి వ్యక్తులతో సమస్యలు కలుగును. భార్య భర్తల మధ్య తగ్గును. సంతానము కొరకు తపించెదరు. తల్లి ఆరోగ్యము ఆందోళనకు గురి చేయును. వాహన ప్రమాదములు ఎదురగును.

2026-2027 వృశ్చికరాశికి సంవత్సరాంతమున అన్ని విధములా పుంజుకొని సర్వశక్తుమంతులుగా సర్వకార్యములు చక్కదిద్దుకొందురు. మనోబలము పెరుగును. తండ్రివైపు బంధువులతో సఖ్యత కలుగును. దాయదుల సహకారముతో స్థిర చరాస్తులను వృద్ధి చేసేదరు. సోదర సోదరీల మధ్య సఖ్యత కలుగును. సర్వులు సహకరించెదరు. భూ, గృహ నిర్మాణాది కార్యములు తిరిగి ప్రారంభమగును. ధైర్యము వహించగలరు. సాహసోపేతమైన కార్యములు చేయుదురు. స్త్రీ దేవతారాధనాసక్తి కలిగి తరచు పుణ్యక్షేత్ర సందర్శనములు చేయుదురు. పోలీసు కోర్టు కేసులలో రాజీ ధోరణితో సకలము చక్కబడును. సంతాన సమస్యలు తొలగిపోవును. మీ మాటకు ఎదురులేకుండును. శత్రుభయము తొలగిపోవును. సంఘ గౌరవము పెరుగును. నూతన పదవీయోగం సిద్దించును. ధర్మయుక్తమైన బుద్ధితో కార్యములు చేయుదురు. మంచి నిద్ర ఆకలి కలిగి శారీరక మానసిక ఆరోగ్యముతో సంచరించెదరు. నూతన వస్త్ర భూషణాదులను సమకూర్చుకొందురు.

విద్యార్దులకు శుభాశుభ మిశ్రమ కాలము. కష్టంచి చదువవలెను. ఫలితము సామాన్యముగా ఉండును. ర్యాంకులు పొందుటలో వెనుబడిపోవుదురు. ఆరోగ్యలోపములతో సరియైన దృష్టి సారించలేక సతమతమగుదురు.

నిరుద్యోగులకు అనుకూలత పెరుగును. శ్రమకు తగిన ప్రోత్సాహము లభించి విజయము సాధించగలరు. అనవసర సంచారము కలుగును. ధనము వృధాగా ఖర్చు అగును. చివరి ప్రయత్నములో సానుకూలత కలుగును.

ఉద్యోగులకు నిరాశతో కూడి నిర్వహణ కలుగును. సహచరులతో కలహములతో ఇబ్బంది పడెదరు. పై అధికారులను మెప్పించలేకుందురు. ప్రమోషన్లు నిలచిపోవును. దూరప్రాంత అయిష్ట బదిలీలు జరుగును.

వ్యాపారులకు శుభాశుభ మిశ్రమ కాలము నూతన ప్రయత్నములు అనుకూలించవు కొన్ని వ్యాపారములు మూత పడును. స్థానభ్రంశము కలుగును. ఆటంకములతో ఆదాయ మార్గములు మూసుకొని పోవును.

కార్మికులకు శ్రమ కాఠిన్యము పెరుగును. చేసినపనికి తగిన గుర్తింపు లేకుండును. ఇంటియందు పెద్దవారిని ఆరోగ్యము మందగించును. ప్రమాదములు ఎదురు కాగలవు.

వ్యవసాయదారులకు చీడపీడల ఉదృతితో ధనాదాయము తగ్గును. గిట్టుబాటు ధరలు లేక చతికెల పడిపోవుదురు. క్షేత్ర వృద్ధి లేకుండును. పశు గో లాభము సామాన్యముగా నుండును. నూతన వ్యవసాయ పద్దతులు అవలంభించి ధనము సంపాదించగలరు.

ఆక్వాకల్చర్ వారికి మిశ్రమ ఫలదా యకము.ధనాదాయ మార్గములు సామాన్యముగా నుండును. ఖర్చులు పెరుగును. తరచూ వ్యాపార ప్రాంతములు మార్చవలసి వచ్చును. భూ లాభము కలుగును. ఆదాయ మార్గములు విస్తరించుకొని అభివృద్ధికి బాటలు వేయుదురు.

కవులు, కళాకారులకు గౌరవమర్యాదలు సామాన్యము. కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రజా ప్రభుత్వ గుర్తింపు సామాన్యముగా నుండ గలదు. కష్టించి పనికి తగిన పారితోషకము లభించక ఇబ్బంది పాలగుదురు.

సినిమా రంగము బాగస్వాముల మధ్య కలహములు కలుగును. ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోవును. స్థిరచరాస్తులు కరిగిపోవును. గౌరవప్రతిష్టలు తగ్గును.

రాజకీయ నాయకులకు అభివృద్ధి మందగించును ప్రజా, ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమగును. శత్రుబాధ ఎక్కువగును.

NRIలకు పూర్తి వ్యతిరేకత వ్యక్తమగును. వెనుకకు రాక తప్పదు. స్పెక్యులేషన్ లాభించదు.

2026-2027 వృశ్చికరాశి: గ్రహశాంతి, అదృష్టసంఖ్య, అదృష్ట రత్నం & రుద్రాక్షధారణం

🙏 గ్రహశాంతి

ఈ సంవత్సరమంతయూ శని, బుధ, రాహు, కుజ, రవి, గురు శాంతి జరిపించవలయును. నవగ్రహ శాంతి క్రమం పరిశీలించండి.

🔢 అదృష్టసంఖ్య
9

1, 2, 3, 4, 7 మిత్ర సంఖ్యలు. ప్రతినెల 9, 18, 27 తేదీలు ఆది, సోమ, మంగళ, గురువారములు అదృష్టప్రదము.

💎 అదృష్ట రత్నం

విశాఖ-పుష్యరాగము, అనూరాధ-నీలము, జ్యేష్ట-పచ్చ ధరించవలెను

📿 రుద్రాక్షధారణం

షణ్ముఖి, సప్తముఖి, పంచదశముఖి, షష్టదశముఖి, గౌరిశంకర.

Vruschika Rasi Phalalu 2026-2027 PDF Download

Get the high-resolution PDF - Vruschika 2026-2027 Horoscope PDF Yearly Predictions in Telugu. Free for personal use.


Rasi Phalalu 2026-2027 Copyrights: “BrahmaSri Pedagadi Mohana Ravishankar Daivagna”, Mobile: 9949598627. Read Disclaimer

ముఖ్య సూచన: ఈ వృశ్చిక రాశి ఫలితాలు 2026-2027 పూర్తిగా గోచార గ్రహ సంచారాలను (Planetary Transits) ఆధారంగా చేసుకుని విశ్లేషించబడినవి. ఇవి కేవలం చంద్ర రాశిని (Moon Sign) పరిగణనలోకి తీసుకుని అందించిన సాధారణ అంచనాలు. ఖచ్చితమైన మరియు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించవలసిందిగా సూచించడమైనది.

» Telugu Festivals 2026 (IST)